Chiranjeevi Balakrishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే ఆఫ్‌స్క్రీన్‌లో వీరిద్దరు కలిసి కనిపించి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. తాజాగా వీరిద్దరి గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే బాలయ్య చేయబోయే కొత్త సినిమాకు చిరు స్పెషల్ విషెస్ తెలిపారట. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ చెప్పారు!
బాబీ గతేడాది చిరుతో కలిసి 'వాల్తేరు వీరయ్య' సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో బాబీకి చిరంజీవి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాతి సినిమాగా బాలయ్యతో NBK 109 అనౌన్స్ చేశారు బాబీ. అలా చిరుతో సెన్సేషన్ హిట్ కొట్టిన బాబీ ప్రస్తుతం బాల్యయ్య సినిమా కోసం తన వర్క్‌ను మొదలు పెట్టారు. మాసివ్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలోనే మెగాస్టార్ స్పెషల్ విషెస్ తెలియజేసినట్లు బాబీ చెప్పారని బయట కథనాలు వస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ బాలకృష్ణ సినిమా మొదలు పెట్టిన తర్వాత తనకు చిరంజీవి కాల్ చేసి స్పెషల్ విషెస్ తెలియజేశారని అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా కన్నా భారీ విజయాన్ని అందుకోవాలని ఆశించారట. అలా చిరు - బాలయ్య సినిమాకు విషెస్ చెప్పినట్టు వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న ఇద్దరు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.