తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మేజర్'​కు చిరు ఫిదా.. మహేశ్​ను ప్రశంసిస్తూ 'మెగా' ట్వీట్ - చోర్ బజార్

Chiranjeevi: 'మేజర్'​ సినిమా కాదని, అదో ఎమోషన్​ అని కొనియాడారు మెగాస్టార్​ చిరంజీవి. ఇటీవలే సినిమా చూసిన ఆయన.. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి చిత్రాన్ని వెన్నంటే ఉండి ప్రోత్సాహించిన సూపర్​స్టార్​ మహేశ్​ను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు.

chiranjeevi latest tweet
adivi sesh major

By

Published : Jun 13, 2022, 7:40 PM IST

Chiranjeevi: 26/11 హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మేజర్'​ సినిమాపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఇది సినిమా మాత్రమే కాదని, ఒక ఎమోషన్ అని అన్నారు. ఈ మేరకు సోమవారం చిత్రబృందానికి స్వయంగా అభినందనలు తెలిపి వారికి విందు ఏర్పాటు చేశారు మెగాస్టార్.

మేజర్​ యూనిట్​తో మెగాస్టార్

"'మేజర్'​ సినిమా కాదు.. అదో భావోద్వేగం. ఒక గొప్ప హీరో, అమరవీరుణి కథ. మేజర్ సందీప్​ ఉన్నికృష్ణణ్​ కథను చాలా గొప్పగా, సూక్ష్మంగా చెప్పారు. ఇలాంటి మంచి ఉద్దేశాలున్న చిత్రానికి దన్నుగా నిలిచిన సూపర్​స్టార్ మహేశ్​ పట్ల గర్వంగా ఉంది. చిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు."

-చిరంజీవి, నటుడు

'మేజర్'​ చిత్రబృందాన్ని అభినందించిన మెగాస్టార్​కు ట్విట్టర్​ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు మహేశ్​బాబు. మేజర్​ టీమ్​ ఇప్పుడు సంతోషంలో మునిగితేలుతుందని అన్నారు. హీరో శేష్​ కూడా జీవితంలో మరచిపోలేని విందులో పాల్గొన్నా అంటూ ట్వీట్ చేశారు.

చిరుతో శేష్

మహేశ్‌బాబు నిర్మాతగా మారి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం 'మేజర్‌'. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కగా.. అడివి శేష్‌ హీరోగా నటించారు. శోభిత, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, మెప్పు పొందుతోంది.

ఫ్యామిలీతో మహేశ్

రిలీజ్​ డేట్​తో 'చోర్ బజార్': యువ హీరో ఆకాశ్​ పూరి నటించిన 'చోర్​ బజార్​' చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదలకానుంది. యాక్షన్​ ప్యాక్​డ్​ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్​. యూపీ ప్రొడక్షన్స్​ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జీవన్​ రెడ్డి దర్శకుడు.

.

ఇదీ చూడండి:'బ్రహ్మస్త్రం' కోసం చిరు.. భోళాశంకర్​లో నితిన్​!.. కొత్త పోస్టర్​తో మెగాహీరో

ABOUT THE AUTHOR

...view details