odisha rail accident Chiranjeevi : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఘటనలో ప్రాణాలు కోల్పొయిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు భారీగా రక్తం అవసరం అవుతుందని.. వారి ప్రాణాలు కాపాడేందుకు బ్లడ్ యూనిట్స్ ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ విషాదకర ఘటన గురించి తెలియగానే తాను షాక్కు గురైనట్లు పేర్కొన్నారు.
Coromandel train accident today : "రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ వార్త తెలియగానే షాక్కు గురయ్యాను. నా హృదయం ఎంతో బరువెక్కిపోయింది. ఇటువంటి సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అవసరమని అర్థమవుతుంది. రక్తదానం చేసేందుకు సమీప ఆస్పత్రుల వద్ద ఫ్యాన్స్, దగ్గర్లో ఉన్న ప్రజలు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని చిరు అన్నారు.
చాలా భాదాకరం : సల్మాన్ ఖాన్
"ఇలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను"
ధైర్యాన్ని ప్రసాదించాలని : తారక్
ఈ విషాదకర ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. "కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ఘటన వల్ల ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఇలాంటి కష్టకాలంలో వారందరికీ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని తారక్ ట్వీట్ చేశారు.