తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Chiranjeevi Akhil Socio Fantasy Movies : చిరు-అఖిల్ సార్​​.. ఈ సారి యూవీ క్రియేషన్స్​ను ఏం చేస్తారో? - చిరంజీవి భోళాశంకర్​ ప్రొడక్షన్​ హౌస్​

Chiranjeevi Akhil Socio Fantasy Movies : మెగాస్టార్​ చిరంజీవి-యంగ్​ హీరో అఖిల్​ నటించిన లేటెస్ట్​ సినిమాలు భారీ డిజాస్టర్​ను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్​లో తెరకెక్కాయి. అయితే ఇప్పుడీ ఇద్దరు హీరోలు.. తమ అప్​కమింగ్​ సినిమాలను ఒకే బ్యానర్​లో చేయబోతున్నారు. ఆ వివరాలు..

Chiranjeevi Akhil Socio Fantasy Movies
చిరంజీవి అఖిల్​

By

Published : Aug 13, 2023, 5:23 PM IST

Updated : Aug 13, 2023, 7:03 PM IST

Chiranjeevi Akhil Socio Fantasy Movies : మెగాస్టార్​ చిరంజీవి రీసెంట్​గా 'భోళాశంకర్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మెహెర్​ రమేశ్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తమన్న, కీర్తి సురేశ్​ లాంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్​ ముందు డిజాస్టర్​ టాక్​ అందుకుంది. దీంతో చిరు ఫ్యాన్స్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏకే బ్యానర్స్​ ఎంటర్​టైన్మెంట్స్​పై అనిల్ సుంకర నిర్మించారు.

Akhil Agent Production House : ఇక ఇదే నిర్మాణ సంస్థ నుంచి అక్కినేని అఖిల్​ 'ఏజెంట్'​ సినిమా కూడా గతంలో విడుదలై భారీ డిజాస్టర్​ను అందుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అఖిల్ తీవ్రంగా శ్రమించి​ మునుపెన్నడు లేని లుక్​లో కనిపించినప్పటికీ.. అది సినిమా ఫలితాలను మార్చలేకపోయింది. అలా ఈ రెండు సినిమాలు అనిల్ సుంకరకు భారీ నష్టాన్ని చేకూర్చాయి.

అయితే ఏ హీరోయైనా తమ లేటెస్ట్ మూవీ రిజల్ట్​ రాగానే ఇక దాన్ని పక్కనపెట్టేసి మరో సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయిపోతారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అలాగే ఇప్పుడు చిరు-అఖిల్​ కూడా అదే చేస్తున్నారు. అఖిల్​ తన కొత్త సినిమా 'అఖిల్​ 6' కోసం హోమ్​వర్క్​ చేస్తున్నారు. ఈ సినిమాను కొత్త దర్శకుడిగా పరిచయం కానున్న అనిల్​ కుమార్ రూపొందిచనున్నారని తెలిసింది.

Chiranjeevi Vasista Movie : అలాగే మెగాస్టార్​ చిరంజీవి కూడా తన అప్​కమింగ్ మూవీపై దృష్టి సారిస్తున్నారు. 'భోళాశంకర్​' తర్వాత వరుస సినిమాలను లైన్​లో పెట్టిన ఆయన.. 'బింబిసార' దర్శకుడు వశిష్ఠకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని తెలిసింది. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం తన కాల్షీట్​లోని కొన్ని డేట్లను కూడా మెగాస్టార్ కేటాయించారట.

అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. యాదృశ్చికంగా ఈ రెండు సినిమాలు సోషియో ఫ్యాంటసీలుగా రూపొందనుందని తెలిసింది. పైగా ఈ రెండు సినిమాలు యూవీ బ్యానర్స్​లోనే రానుండటం మరో విశేషం. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో? యూవీ క్రియేషన్స్​ను లాభాలు తెచ్చిపెడతాయో లేదో..

Akhil Akkineni : అఖిల్ కోసం.. రంగంలోకి శ్రీకాంత్..!

Megastar Chiranjeevi : "తగ్గేదే లే.." అంటున్న చిరంజీవి!

Last Updated : Aug 13, 2023, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details