Chiranjeevi acted serial ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టి.. స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో చిరంజీవి. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగారు. డ్యాన్స్‌లు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు. కొత్త తరం నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ వస్తున్న ఆయన.. ఇప్పటికీ యువ హీరోలకు దీటుగా ఇంకా చిత్రాలను కొనసాగిస్తున్నారు.
తన 40 ఏళ్ల సినిమా కెరీర్లో చిరంజీవి ఎన్నో రికార్డులను సృష్టించారు. నటుడిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో అండగా నిలుస్తున్నారు. అయితే చిరు వెండితెర అరంగేట్రం చేయకముందు.. చెన్నైలో నటనకు సంబంధించిన కోర్సును చేశారు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రలు.. విలన్ పాత్రలను కూడా పోషించారు. మొత్తంగా ఇప్పటికవరకు 150కి పైగా చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.