తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సామ్‌తో నా జర్నీ ముగిసిందనుకుంటున్నా: చిన్మయి - సమంత డబ్బింగ్​ చిన్మయి

హీరోయిన్​ సమంతతో తనుకున్న అనుబంధాన్ని గురించి చెప్పింది సింగర్ చిన్మయి. ఏం చెప్పిందంటే.

samantha chinmayi
సమంత చిన్మయి

By

Published : Sep 3, 2022, 3:05 PM IST

'ఏమాయ చేసావె' సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైన స్టార్ హీరోయిన్​ సమంత.. ఆ మూవీతో ప్రేక్షకుల హృదయాల్ని ఆకట్టుకుంది. ఆమె పోషించిన జెస్సీ పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండి పోయింది. ఇందుకు కారణం ఆమె నటన, గొంతు. ఈ వాయిస్​ అందించింది సింగర్​ చిన్మయి. సామ్​ నటించిన ఎన్నో చిత్రాలకు ఆమె డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి.. తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలపై స్పందించింది.

"సమంత ఎంతో మంచి వ్యక్తి. తెలుగులో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నాకొక కెరీర్‌ వచ్చిందంటే అది సామ్‌ వల్లే. ఇప్పుడు తన పాత్రలకు తనే డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. అందుకు ఆనందంగా ఉంది. సమంతకు నేను డబ్బింగ్‌ చెప్పే దశ ముగింపునకు వచ్చిందనుకుంటున్నా. ఇక, మేమిద్దరం కలిసినప్పుడల్లా ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టకపోయినంత మాత్రాన విడిపోయినట్లు కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడం నాకిష్టం లేదు. మేమిద్దరం కలుసుకున్నాం.. మాట్లాడుకున్నాం.. డిన్నర్‌కు వెళ్లాం.. అని చెప్పడం వల్ల ఎవరికి లాభం? అందుకే మేము కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పం. మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం"

"నా భర్త రాహుల్‌ - సామ్‌ మంచి స్నేహితులు. సామ్‌ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. తను కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మంచి పేరు సొంతం చేసుకుంది. ఎంతోమంది పిల్లలకు (ప్రత్యూష ఫౌండేషన్‌) సాయం చేస్తోంది. ఇక, మనుషులు ఎలాంటి వాళ్లంటే సాయం కావాల్సినప్పుడు.. ‘మీరు దేవత’ అని పొగుడుతారు. అదే ఏదైనా అంశంపై పెదవి విప్పితే ఫెమినిస్ట్‌ అంటూ తిడతారు. 'ఫ్యామిలీ మేన్‌ -2' టైమ్‌లోనూ సామ్‌ని పలువురు విమర్శించారు. అది నాకు నచ్చలేదు. అందుకే తనకి సపోర్ట్‌ చేస్తూ మాట్లాడాను. అందులో సామ్‌ పాత్ర మీకు నచ్చకపోతే మర్యాదపూర్వకంగా మీ అభిప్రాయాన్ని బయటపెట్టొచ్చు. అంతేకానీ నిందిచాల్సిన అవసరం లేదు" అని చిన్మయి చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: బెడ్​పై లేవలేని స్థితిలో యాంకర్​ లాస్య.. ఏమైంది

ABOUT THE AUTHOR

...view details