తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Chandramukhi : "చంద్రముఖి" సినిమా ఎలా పుట్టింది.. ఆసక్తికర విశేషాలు మీకోసం! - లారెన్స్ చంద్రముఖి

Chandramukhi : రజనీకాంత్ చంద్రముఖి 2005లో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్ (Chandramukhi -2) తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పి.వాసు. మరి, అసలు చంద్రముఖి స్టోరీ ఎలా పుట్టింది..? రజనీకాంత్ ఈ చిత్రంలో నటించడానికి ఎలా అంగీకరించారు..? వంటి ఇంట్రస్టింగ్ విషయాలను ఇక్కడ చూద్దాం.

chandramukhi 2
chandramukhi

By

Published : Aug 6, 2023, 12:50 PM IST

Chandramukhi : రజనీకాంత్ నటించిన "చంద్రముఖి" సినిమా ఒరిజినల్ కాదు. ఈ సినిమా మొదటగా మలయాళంలో తెరకెక్కింది. టైటిల్ "మణిచిత్రతాఝు". ఫాజిల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు పి.వాసు చూశారు. ఓ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన సమయంలో కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్దన్ ను కలిసి ఈ స్టోరీ గురించి చెప్పారట. కథలో కొన్ని మార్పుల తర్వాత "ఆప్తమిత్ర"గా ఈ మూవీ తెరకెక్కింది. అక్కడా సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత కొంత కాలానికి.. రజనీకాంత్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారు డైరెక్టర్ పి.వాసు. ఆయన కొత్త స్టోరీ లైన్ అనుకుంటుండగా.. "ఆప్తమిత్ర"ను రీమేక్ చేద్దాం అన్నారట రజనీ.

Chandramukhi 2 First Look : 'చంద్రముఖి -2' పోస్టర్ వచ్చేసింది.. వెట్టయాన్ రాజాగా 'లారెన్స్' లుక్స్ అదుర్స్

అయితే.. రజనీకాంత్ ఇమేజ్ కు అనుగుణంగా కథలో చాలా మార్పులు చేశారు దర్శకుడు. మలయాళంలో రాజు పాత్రనే లేదు. వడివేలు, సోనూ సూద్ వంటి క్యారెక్టర్లన్నీ కన్నడ, "చంద్రముఖి" (Chandramukhi)లోనే ఉంటాయి. ఇక, రాజు మేనరిజం "లక..లక..లక..లక" పదాన్ని స్వయంగా రజనీ సూచించారట. ఏం పెట్టాలా.. అని దర్శకుడు ఆలోచిస్తుండగా.. హిమాలయాలకు వెళ్లిన సమయంలో ఓ సాధువు నోటివెంట విన్న ఈ పదం గురించి చెప్పారట రజనీ.

ఈ మేనరిజం సూపర్ హిట్ అవుతుందని బలంగా నమ్మారట దర్శకుడు పి.వాసు. అనుకున్నట్టుగానే సినిమా రిలీజైన తర్వాత థియేటర్లన్నీ.. "లక..లక..లక..లక" శబ్ధంతో హోరెత్తిపోయాయి. అదేవిధంగా.. "వారాయ్..." అంటూ సాగే తమిళ పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ తమిళ్ సాంగ్ అర్థం తెలియకపోయినా.. తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. చాలా మందికి తెలియనిది ఏమంటే.. తమిళ్ లో తెలుగు వెర్షన్ సాంగ్ ఉంటుంది. దర్శకుడు కావాలనే ఇలా మార్చి పెట్టారట. అక్కడ కూడా తెలుగు సాంగ్ సూపర్ హిట్ కొట్టింది.

Kangana Chandramukhi First Look : ఆసక్తికరంగా కంగనా లుక్​.. రాజ నర్తకిగా చీరలో మెరుస్తూ..

ఇక, చంద్రముఖి (Chandramukhi)లో రజనీ సరసన స్నేహను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ.. ఆమెకు కుదరలేదు. ఆ తర్వాత సిమ్రాన్ ను తీసుకోవాలని భావించారు. మూడ్రోజులు షూటింగ్ కు సైతం హాజరై ఆ తర్వాత తప్పుకుంది. అనంతరం రీమాసేన్, సదా పేర్లు పరిశీలించి.. ఫైనల్ గా నయన తారను ఓకే చేశారు. చంద్రముఖి తెచ్చిన స్టార్ డమ్.. నయనతార ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

ఇన్నాళ్లకు చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వాసు. లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రాజనర్తకిగా బాలీవుడ్ నటి కంగనా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం పార్ట్-1 ను ఏ మేరకు బీట్ చేస్తుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details