తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Chandramukhi 2 Twitter Review : 'వెట్టయాన్ రాజా వచ్చేశాడు'.. మరి ఆడియెన్స్​ను మెప్పించాడా? - చంద్రముఖి 2 విడుదల తేదీ

Chandramukhi 2 Twitter Review : రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చంద్రముఖి-2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే?

Chandramukhi 2 Twitter Review
Chandramukhi 2 Twitter Review

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 10:37 AM IST

Updated : Sep 28, 2023, 12:02 PM IST

Chandramukhi 2 Twitter Review : కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి-2'. ప్రముఖ దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన చంద్రముఖి-1కు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో లారెన్స్.. వెట్టయాన్ రాజా పాత్రలో మెరవగా.. చంద్రముఖిగా కంగనా ప్రేక్షకుల ముందుకొచ్చింది. లైకా ప్రొడక్షన్​ బ్యానర్​పై నిర్మాత సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా గురువారం(సెప్టెంబర్ 28) గ్రాండ్​గా థియేటర్లలో విడులైంది. ఇక ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన ఆడియెన్స్.. సినిమా గురించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ 'చంద్రముఖి-2' ఎలా ఉందంటే..

ఫస్ట్​ షో చూసిన కొందరు సినిమా డీసెంట్​గా ఉందని ఆడియెన్స్​ కితాబిస్తున్నారు. హర్రర్ సీన్స్, సెకండ్ హాఫ్ బాగుందని, ముఖ్యంగా నటి కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని ఓ నెటిజన్ ట్విట్టర్​లో రాసుకొచ్చారు. సినిమా చూసిన మరో నెటిజన్.. ఫస్ట్​ హాఫ్ చాలా ఎంటర్​టైనింగ్​గా ఉందని.. కమెడియన్​ వడివేలు నటనతో నవ్వులు పూయించారన్నారు.

అయితే సినిమాలో లారెన్స్ పాత్ర కంటే బాలీవుడ్ బ్యూటీ కంగనా గురించే నెట్టింట టాక్ నడుస్తోంది. ఈమె స్క్రీన్ ప్రెజన్స్ బాగుందని.. సినిమాకు ఆమె నటన ప్లస్​ పాయింట్ అని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాతో.. సౌత్​ ఇండస్ట్రీలో కంగనా గ్రాండ్​గా రీ ఎంట్రీ ఇచ్చారని మరికొందరు అంటున్నారు.

Chandramukhi 2 Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 'చంద్రముఖి-1'కు సీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారెన్స్​, కంగనాతో పాటు వడివేలు, విఘ్నేష్, లక్ష్మీ మేనన్, సృష్టి డాంగే, మహిమా నంబియార్, రావు రమేష్, రవి మారియా, సురేశ్​ మీనన్, సుభిక్షా కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీర‌వాణి సంగీతాన్ని అందించారు. ఇక ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ బాధ్యతలు చేపట్టారు. సాంగ్స్​తో పాటు ట్రైలర్​తో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే పెరిగాయి.

Chandramukhi 2 Song : 'చంద్రముఖి-2' నుంచి 'స్వాగతాంజలి'.. దేవకన్యలా కంగనా​!

Chandramukhi 2 Trailer : లక.. లక.. లక.. ఆసక్తిగా 'చంద్రముఖి 2' ట్రైలర్‌.. 200ఏళ్ల పగతో..

Last Updated : Sep 28, 2023, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details