Chandramukhi 2 Kangana Ranaut : కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ హీరోగా, ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'చంద్రముఖి 2'. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వినాయక చవితికి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'స్వాగతాంజలి..' పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కంగనా రనౌత్ దేవకన్యలా కనిపించారు. మీరూ చూసేయండి.
Chandramukhi 2 Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 'చంద్రముఖి-1'కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారెన్స్, కంగనాతో పాటు వడివేలు, విఘ్నేష్, లక్ష్మీ మేనన్, సృష్టి డాంగే, మహిమా నంబియార్, రావు రమేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా..ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
Chandramukhi 2 Release Date : అంతే కాకుండా ఈ సినిమా కోసం తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా ఆంథోని ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'జైలర్' మేనియా.. ఆటోడ్రైవర్లకు కోసం ర్యాపిడో స్పెషల్ షో!
Jailer Special Show For Rapido Drivers : తమ అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా చూడడానికి బెంగళూరు, చెన్నైలో పలు ఆఫీస్‌లు సినిమా విడుదల రోజు సెలవు ప్రకటించాయి. రజనీపై తమ అభిమానాన్ని చూపించటంలో భాగంగా 'ర్యాపిడో' సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. బైక్, ట్యాక్సీ సేవలు అందించే ర్యాపిడో డ్రైవర్లకోసం 'జైలర్' స్పెషల్ షో వేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. చెన్నైలో ఆగస్టు 12న కృష్ణవేణి థియేటర్‌లో కేవలం డ్రైవర్ల కోసం స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిపింది. దీంతో 500కు పైగా డ్రైవర్లు రజనీ కొత్త సినిమా చూడొచ్చు.
ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మట్లాడారు. ర్యాపిడో డ్రైవర్లనుకొనియాడారు. ర్యాపిడో అభివృద్ధిలో వారిదే కీలక పాత్ర అని తెలిపారు. చెన్నైలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేయటానికి వారు చాలా శ్రమించారని పేర్కొన్నారు. 'పనితో పాటూ అప్పుడప్పుడు విరామం తీసుకోవటం ముఖ్యమే. రజనీకాంత్‌పై ఉన్న అభిమానంలో కెప్టెన్ల (డ్రైవర్లకు)కు సేవలందించినందుకు గర్వపడుతున్నాం' అని పవన్ తెలిపారు.
Chandramukhi 2 First Look : 'చంద్రముఖి -2' పోస్టర్ వచ్చేసింది.. వెట్టయాన్ రాజాగా 'లారెన్స్' లుక్స్ అదుర్స్
Kangana Chandramukhi First Look : ఆసక్తికరంగా కంగనా లుక్.. రాజ నర్తకిగా చీరలో మెరుస్తూ..