తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ ప్రొడ్యూసర్ బెదిరించాడు.. తేడా వస్తే నేను మసి: హీరోయిన్ ఆవేదన​ - చాందినీ చౌదరి ఆలీతో సరదాగా

Chandini Chowdary Alitho saradaga: తనను ఇండస్ట్రీలో కనిపించకుండా చేస్తానని ఓ ప్రొడ్యూసర్​ బెదిరించినట్లు తెలిపింది హీరోయిన్​ చాందినీ చౌదరి. తనకు ఏమైనా అవుతుందనే భయంతో అతడికి ఎదురు తిరిగలేదని చెప్పింది!

chandini chowdary
చాందిని చౌదరి

By

Published : Jun 15, 2022, 11:49 AM IST

Chandini Chowdary Alitho saradaga: తనని, తన కుటుంబాన్ని ఇండస్ట్రీలో కనిపించకుండా చేస్తానని ఓ ప్రొడ్యూసర్‌ బెదిరించినట్లు హీరోయిన్​ చాందినీ చౌదరి చెప్పింది. కిరణ్‌ అబ్బవరంతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం 'సమ్మతమే'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కిరణ్‌తో కలిసి ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చేసి.. ఈ విషయాన్ని చెప్పింది.

"నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు" అని ఆలీ అడగ్గా, తనని తాను బ్యాకప్‌ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరని, వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. తనని బెదిరించిన నిర్మాతతో చేసుకున్న కాంట్రాక్ట్‌కు విలువలేదని తర్వాత తెలిసిందని ఆమె వివరించింది.

కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ.. "తాను కాలేజ్‌ చదువుతుండగా, 'కచ్చితంగా నువ్వు బస్టాండ్‌లో బఠాణీలు అమ్ముకుంటావురా' అని లెక్చరర్స్‌ తిట్టేవాళ్లని చెప్పుకొచ్చాడు. ఇంకా తన లవ్​స్టోరీ గురించి కూడా చెప్పాడు.

'ఎస్‌.ఆర్‌. కల్యాణ మండపం' చేస్తుండగా ఎస్వీ రంగారావు ఆశీస్సులు అందించినట్లు తెలిపాడు. "నేను సాయికుమార్​ రూమ్​లోకి వెళ్లాను. నిశబ్దం అంతా. అక్కడ గాలి వచ్చే ఛాన్స్ కూడా లేదు. చెప్పులు తీసేసి కళ్లు మూసుకోని దండ పెట్టుకోగానే.. అక్కడే ఉన్న దండ మూడు సార్లు టక్కున కొట్టింది. షాక్​ అయ్యా. భయమేసింది. కానీ సాయికుమార్​ సైలెంట్​గా నిలబడ్డారు. 'అదేరా పెద్దవారి ఆశ్విర్వాదం' అని నాతో చెప్పారు." అని గుర్తుచేసుకున్నాడు.

ఇదీ చూడండి: భారీ విజువల్​ వండర్​గా రణ్​బీర్​ 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్​

ABOUT THE AUTHOR

...view details