సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మళ్లీ మొదలైంది. దాదాపు రెండేళ్ల తర్వాత శనివారం తిరిగి ప్రారంభమైంది. కాగా, ఆదివారం రాయ్‌పుర్ స్టేడియం వేదికగా తెలుగు వారియర్స్-కేరళ స్ట్రైకర్స్ మధ్య లీగ్ మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ నాయకత్వం వహిస్తున్న తెలుగు వారియర్స్ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో అఖిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 91, రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే, ప్లేయర్లను ఎంకరేజ్ చేయడానికి ప్రముఖ సినీ నటులు వెంకటేశ్ తదితరులు వచ్చారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్.. మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేసి రాణించాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్ లీడ్‌తో కేరళ జట్టుకు 170 పరుగులు లక్ష్యన్ని నిర్దేశించింది తెలుగు టీమ్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు.. ఆఖరి ఓవర్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. దీంతో తెలుగు వారియర్స్ 64 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్ మొదలయ్యే ముందు నందమూరి తారకరత్న మరణం పట్ల ప్లేయర్స్ సంతాపం తెలిపారు.