తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

CCL 2023: తెలుగు వారియర్స్​ ప్రాక్టీస్​ మ్యాచ్​ ఫొటోస్ చూశారా? - సీసీఎల్​ 2023 ప్రాక్టీస్ మ్యాచ్​

సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) 2023 సందడి మొదలైపోయింది. తెలుగు సినీ స్టార్స్​ ప్రాక్టీస్​ మ్యాచ్​ ప్రారంభించేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 14, 2023, 12:36 PM IST

సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) 2023 సందడి షురూ అయిపోయింది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మన సినీ తారలు క్రికెట్ ప్రాక్టీస్ సెషన్​ను మొదలుపెట్టేశారు. నెట్స్​లో చెమటలు చిందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. ఇందులో ఆది సాయికుమార్​, నిఖిల్​ సహా పలువురు కనిపించారు. వీటిని చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ ఫొటోలను ట్రెండ్ చేస్తున్నారు.

సీసీఎల్- 2023లో పాల్గొనే జట్లు- కెప్టెన్లు.. బెంగాల్ టైగర్స్ - జిషు, భోజ్‌పురి దబాంగ్స్ - మనోజ్ తివారీ, చెన్నై రైనోస్ - ఆర్య, కర్ణాటక బుల్డోజర్స్ - సుదీప్, కేరళ స్ట్రైకర్స్ - కుంచాకో బోబన్, ముంబై హీరోస్ - రితేష్ దేశ్‌ముఖ్, పంజాబ్ డి షేర్ - సోనూ సూద్, తెలుగు వారియర్స్ – అఖిల్ అక్కినేని

ఆది సాయికుమార్​

తెలుగు వారియర్స్ జట్టు ఇదే.. అఖిల్ అక్కినేని (కెప్టెన్), వెంకటేష్, సచిన్ జోషి, సుధీర్ బాబు, తరుణ్, ప్రిన్స్ సెసిల్, సాయిధరమ్ తేజ్, అజయ్, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నందకిషోర్, విశ్వ, నిఖిల్, ప్రభు, రఘు, సుశాంత్, శ్రీకాంత్, సామ్రాట్ రెడ్డి.

అశ్విన్​

కాగా, మొత్తం ఎనిమిది ఇండస్ట్రీలు పాల్గొనే తాజాగా ఎడిషన్ ఫిబ్రవరి 18న ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 19న హైదరాబాద్​లో జరగనుంది. ఈ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనుంది. టోర్నీలో ఉన్న ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్​కు చేరుకుంటాయి. 1, 4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య తొలి సెమీస్, 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరిగే రెండో సెమీస్​ జరగనుంది. ఈ రెండింటిలో గెలిచిన జట్లు ఫైనల్​కు చేరుకుంటాయి. ఇక ఈ తుదిపోరులో తలపడి గెలిచిన జట్టును ట్రోఫీని ముద్దాడుతుంది.

నిఖిల్​
తెలుగు స్టార్స్​ ప్రాక్టీస్​ మ్యాచ్​ ఫొటోస్

ఇదీ చూడండి:Valentines Day: ఫిల్మీ రేంజ్​లో స్టార్ కపుల్స్​ లవ్​ స్టోరీస్​

ABOUT THE AUTHOR

...view details