పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా.. 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తి కాగా, మరో 25 శాతం పెండింగ్‌లో ఉంది. ఈ సినిమా పూర్తవ్వాలంటే కనీసం నెలరోజులైనా కేటాయించాల్సి ఉంటుంది. అయితే వరుస సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ 'ఓజీ' సెకెండ్ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొననున్నారు. ఇక ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సెకెండ్ షెడ్యూల్లో పాల్గొననున్నారు.
అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తైన నేపథ్యంలో మొదటి భాగాన్ని త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నారట. ఆ తర్వాత స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మిగతా షూటింగ్ పూర్తి చేసి రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. అయితే ఈ నిర్ణయానికి పవన్ ఓకే చెప్పాల్సి ఉందట. ఈ క్రమంలో పవన్ అభిప్రాయం ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలా లేదా అన్న విషయంపై క్రిష్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.