తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Businessman Re Release Collections : ఇది కదా మహేశ్​ రేంజ్.. రీరిలీజెస్​లో సూర్యభాయ్​దే మైండ్​ బ్లో​ కలెక్షన్స్ - మహేశ్ బాబు బిజినెస్ మ్యాన్​ రీరిలీజ్ కలెక్షన్స్​

Businessman Re Release Collections : సూపర్ స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేసిన పూరి జగన్నాథ్​ 'బిజినెస్‌మ్యాన్' సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన రీ రిలీజ్ సినిమాలన్నింటిలోనూ ఈ చిత్రమే భారీ వసూళ్లను అందుకుంది.

Businessman Re Release Collections
బిజినెస్‌మ్యాన్ రీరిలీజ్ కలెక్షన్స్​

By

Published : Aug 10, 2023, 10:25 PM IST

Businessman Re Release Collections : సూపర్ స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేసిన పూరి జగన్నాథ్​ 'బిజినెస్‌మ్యాన్' సినిమాకు భారీ స్పందన దక్కింది. అత్యాధునిక, డిజిటల్ ఇంటిగ్రేషన్‌తో 4K టెక్నాలజీతో అభిమానుల ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమాకు ముందుగానే భారీ అడ్వాన్స్ బుకింగ్ కనిపించింది. దీంతో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు అందుకుంటుందని అంతా అనుకున్నారు.

అనుకున్నట్టే జరిగింది. మార్నింగ్​ షోలకు 90 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 80 శాతం, ఫస్ట్ షోకు 80 శాతానికిపైగా, సెకండ్ షోకు 85 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని తెలిసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రం కాదు కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లోనూ ఇదే జరిగిందట. తెలుగు రాష్ట్రాల్లో ఈ రీరిలీజ్ చిత్రం భారీగానే వసూళ్లను అందుకుంది. నైజాంలో 2.46 కోట్లు, సీడెడ్‌లో 35 లక్షలు, ఉత్తరాంధ్రలో 42 లక్షలు, కృష్ణా జిల్లాలో 27 లక్షలు, గుంటూరు జిల్లాలో 31.4 లక్షలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 34 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 లక్షల గ్రాస్ వసూళ్లను అందుకుందట.

Businessman Movie Re Release : మొత్తంగా ఏపీ, నైజాంలో కలిపి 4.37 కోట్ల వరకు గ్రాస్​ కలెక్షన్లు, ఓవర్సీస్‌లో 35 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 26.8 లక్షలు, కర్ణాటకలో 27.3 లక్షలకుపైగా గ్రాస్​ వసూళ్లు సాధించింది. అలా ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 5.31 కోట్ల వసూళ్లను అందుకోవడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన రీ రిలీజ్ సినిమాలన్నింటిలోనూ భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇతర రీరిలీజ్​ సినిమాల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో.. పవన్ ఖుషి 3.62కోట్లు, ఎన్టీఆర్ సింహాద్రి రూ.2.90కోట్లు, పవన్ జల్సా 2.57కోట్లు, మహేశ్ ఒక్కడు 1.90కోట్లు, విశ్వక్​ సేన్ ఈ నగరానికి ఏమైంది 1.69కోట్లు, మహేశ్ పోకిరి 1.52కోట్లు, అల్లు అర్జున్ దేశముదురు 1.46కోట్ల గ్రాస్​ వసూళ్లను సాధించాయట.

Mahesh Babu Guntur Karam : 'గుంటూరు కారం' కొత్త పోస్టర్స్​.. ఏంది సార్ మళ్లీ ఈ కన్ఫ్యూజన్​!

Mahesh Babu Birthday : మహేశ్ బర్త్​డే రోజు అస్సలు అలా చేయరట!.. ఎవ్వరు చెప్పినా.. ఏం జరిగినా!!

ABOUT THE AUTHOR

...view details