Bro OTT Streaming : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బ్రో : ది అవతార్'. ఇందులో ఆయన తన మేనల్లుడు మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించారు. ఇటీవలే గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాగే ఎన్నో రాజకీయ వివాదాలను ఎదుర్కొంది. అయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఆగస్ట్ 25న ఓటీటీలోకి వచ్చేసింది. తొలి రోజే డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రంతో పాటు ఆగస్ట్ 25 ఆనంద్ దేవరకొండ బేబీ కూడా ఓటీటీలోకి వచ్చి మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంది.
Bro Movie Collections : 'బ్రో' చిత్రం జులై 28న రిలీజైంది. అయితే ఈ సినిమా.. పవన్ స్టార్ స్టేటస్‌కు తగ్గట్టు హిట్ కాలేదని మొదట టాక్ వచ్చింది. ఎందుకంటే పవన్ రేంజ్‌కు తగ్గట్టు ఒక్క పాట, ఫైట్ లేదని చాలా మంది అన్నారు. కానీ ఈ చిత్రం ఫామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్‌లో 70 కోట్ల రూపాయిల వరకు అందుకుంది. 'అత్తారింటికి దారేది', 'వకీల్ సాబ్' తర్వాత 'బ్రో ది అవతార్' చిత్రమే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. బ్రో సినిమా ముందు వచ్చిన భీమ్లానాయక్‌కు కేవలం అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పర్వాలేదనింపించింది.