సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ్ - పవన్ కల్యాణ్ 'బ్రో' సినిమా శుక్రవారం గ్రాండ్‌గా రిలీజై.. హౌజ్‌ఫుల్ షో స్తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్.. ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లో సందడి చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు రెట్టింపు అయ్యాయి.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్.. శుక్రవారం హైదారాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ సుదర్శన్ థియేటర్ వద్ద దర్శమిచ్చాడు. సగటు అభిమానిలాగే తానూ అందరితో కలిసి.. విజిల్స్, కేరింతలు, చప్పట్ల మధ్య 'బ్రో' సినిమా చూశాడు. థియేటర్లో అకీరాను చూడగానే.. ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. అకీరానందన్ రాకతో థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. మెగా ప్రిన్స్‌ను సెల్ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఫ్యాన్స్. కాగా ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Bro Movie Differences : సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచే అన్ని థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి కనిపించింది. 'బ్రో' పాజిటీవ్ సొంతం చేసుకోవడం వల్ల.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. కాగా తమిళ సినిమా 'వినోదయసిత్తం' రీమేక్‌గా దర్శకుడు సముద్రఖని.. 'బ్రో'ను కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. అయితే తమిళంలో తెరకెక్కిన 'వినోదయసిత్తం' సినిమాకు.. ప్రస్తుతం హిట్‌టాక్ అందుకున్న 'బ్రో' కు ఉన్న తేడాలు ఇవే..
- తమిళ సినిమాలో తండ్రీ కూతుళ్ల మధ్య బంధాన్ని చూపితే.. తెలుగులో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ కనిపించింది.
- వినోదయసిత్తంలో మరణించిన 60 సంవత్సరాల వ్యక్తి.. కుటుంబ పరిస్థితులను చూపించారు. కాగా 'బ్రో'లో 30 ఏళ్ల వ్యక్తి కథగా మార్చారు.
- వినోదయసిత్తంతో పోలిస్తే.. తెలుగు 'బ్రో' లో పవన్ కల్యాణ్ పోషించిన పాత్రను కొంచెం పెంచి.. ప్రత్యేకమైన పర్ఫామెన్స్తో తెరకెక్కించారు.
- తమిళ సినిమా గంటన్నర ఉండగా.. 'బ్రో' కథ రెండు గంటల 15 నిమిషాలు సాగుతుంది.
- తెలుగులో డైరెక్టర్ త్రిమిక్రమ్.. డైలాగులు, స్క్రీన్‌ప్లే అందించి.. ఇక్కడి నేటివిటికి తగ్గట్లు కథను మార్చారు.
Bro Movie Worldwide Collection : ఈ సినిమా ఓవర్సీస్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికా, కెనడాలో కలిపి 256 లోకెషన్లలో సినిమా రిలీజై.. 6,31,970 (సుమారు రూ. 5కోట్లు) డాలర్లు వసూల్ చేసింది. కాగా విదేశాల్లో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ వసూల్ చేసిన తెలుగు సినిమా జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ 'బ్రో' హవా నడుస్తోంది. హైదరాబాద్‌లో దాదాపు 600 షో స్ బుకింగ్స్ నిండిపోయాయని సమాచారం. ఇక విశాఖలో 290కి ఏకంగా 278 షోస్ నిండిపోవడం విశేషం.