Bro Movie Trailer : పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా 'బ్రో'. ఈ సినిమా ట్రైలర్‌ను మూవీయూనిట్ శనివారం విడుదల చేసింది. అయితే 'బ్రో'.. తమిళ సినిమా 'వినోదయ సీతం' సినిమాకు రీమేక్. అయితే ఒరిజినల్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖనియే.. తాజాగా 'బ్రో' సినిమాను తెరకెక్కించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదల కానుంది. మరి 'బ్రో' సినిమా ట్రైలర్ మీరూ చూసేయండి.
మనుషులందరూ భస్మాసురుడి వారసులు అంటూ.. పవర్ స్టార్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. పవన్ కల్యాణ్ అతడికి దర్శనమిస్తారు. ఇక అప్పటి నుంచి పవన్, తేజ్ కలిసి సినిమాలో స్క్రీన్ చేసుకుంటారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందాన్ని మళ్లీ.. కమెడియన్ పాత్రలో తెరపై చూడనున్నాం. అయితే.. పవన్ కల్యాణ్ హిట్ పాటలు ఈ సినిమా అఖర్లో ఓ సన్నివేశంలో ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. దీంతో ఇక థియేటర్లో మాస్ జాతరే అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే విజిలేస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్‌తో కూడిన 'బ్రో' జులై 28 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.