BRO Movie Pavan Kalyan Remuneration : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. గత శుక్రవారం ఇండియాతో పాటు ఓవర్సీస్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుని దూసుకుపోతోంది.
పవన్ కల్యాణ్ వింటేజ్ లుక్స్‌తో పాటు వింటేజ్ పవన్ సినిమా పాటలతో సినిమా మొత్తం పవన్ కంటెంట్‌తో నిండిపోయింది. దీంతో థియేటర్ అంతా ఈలలు గోలలతో సందడిగా మారింది. ఇక ఈ సినిమా విజయాన్ని అందుకోవడం వల్ల మూవీ యూనిట్ పలు ప్రాంతాల్లో సక్సెస్ మీట్స్‌తో వేడుక చేసుకుంటోంది. మరోవైపు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆయన తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ రెమ్యూనరేషన్‌తో పాటు 'బ్రో' సినిమా బడ్జెట్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRO Movie Budget : 'బ్రో' మూవీ బడ్జెట్ సుమారు వంద కోట్లు అంట కదా అది ఇండియాలోదా..? లేక అమెరికా నుంచి తీసుకొచ్చారా..? అంటూ యాంకర్ అడగ్గా.. "అది ఒకరికి అవసరం లేదు.. ఒకరికి అవసరం లేని సమాధానాన్ని నేను ఇవ్వదల్చుకోలేదు. ఈ సినిమాకు ఎంత బడ్జెటైందనే విషయం మాకు మాత్రమే తెలుసు. అది మాకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు" అని ఆయన వెల్లడించారు.
BRO Movie Remuneration : పవన్ రెమ్యూనరేషన్ గురించి అడిగిన ప్రశ్నకు "అది మా కంపెనీకి, కల్యాణ్‌కు ఉన్న ఒప్పందం.. ప్రపంచంలో ఎవరికీ అది అడిగే హక్కు లేదు. తన ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఆయన చేసుకుంటారు. మా ట్యాక్స్ ఫైలింగ్స్‌ను మేము చేసుకుంటాం" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
ఆ మూడు సినిమాలు..
BRO Movie Record : 'బ్రో' సినిమాతో పవన్ కల్యాణ్ మరో రికార్డు సృష్టించారు. ఆయన నటించిన మూడు రీమేక్ సినిమాలు వరసుగా కలెక్షన్లు రూ. 100 కోట్లు దాటాయి. ఇప్పటికే ఈ జాబితాలో 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' ఉండగా.. ఇప్పుడు వంద కోట్ల క్లబ్‌లోకి చేరి 'బ్రో' సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.