తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అదీ పవన్​ రేంజ్​.. త్వరలోనే పాన్ వరల్డ్ సినిమా.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ - bro movie prerelease event bramhanandam

Pawankalyan Bro movie pre release event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్​తో పాన్ వరల్డ్ సినిమా చేస్తానని అనౌన్స్​ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వ ప్రసాద్. ఆ వివరాలు..

pawan kalyan pan world movie
పవన్ కల్యాణ్ పాన్ వరల్డ్ సినిమా

By

Published : Jul 26, 2023, 7:16 AM IST

Pawankalyan Bro movie pre release event : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు. నిన్నమొన్నటిదాకా చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన ఈ సంస్థ మాస్ట్​ మహారాజా రవితేజ 'ధమాకా'తో వెలుగులోకి వచ్చారు. ఈ ప్రొడక్షన్​ హౌస్​పై నిర్మాత విశ్వ ప్రసాద్ వివేక్ కూచిబొట్ల తన సినిమా బడ్జెట్​ పరిధిని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. రీసెంట్​గా పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల రైట్స్​ను కొనుగోలు చేసి హాట్​టాపిక్​గా మారారు. ఆ సినిమాను ఆయనే రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్​ చేస్తున్న మారుతి సినిమాను ఆయనే నిర్మిస్తున్నారు.

రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లానింగ్ పెద్దగా ఉండబోతుందని.. భవిష్యత్​లో పాన్ వరల్డ్ సినిమాలు కూడా చేయనుందని అన్నారు. ఈ క్రమంలోనే బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్​తోనే తమ పాన్ వరల్డ్ మూవీ ఉంటుందని అనౌన్స్​ చేశారు. ఇక ఈ ఈవెంట్​లో హాస్యనటుడు బ్రహ్మానందం కూడా పాల్గొని సందడి చేశారు.

బ్రహ్మా మాట్లాడుతూ.. "ఐ లవ్ యూ బ్రో.. ఈ అవకాశం కల్పించిన సముద్రఖని, నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్​కు ధన్యవాదాలు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, మంచి నటుడు, మంచి మనసున్న మనిషి.. పవన్ కల్యాణ్. ది గ్రేట్ పవన్ కల్యాణ్​తో కలిసి ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు.. పవన్ కల్యాణ్​ విజయాలకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. పవన్ నాకు ఆయన టీనేజి ఉన్నప్పుడు నుంచి తెలుసు. ఆయన గురించి మాట్లాడగలిగే అతి తక్కువ మందిలో నేనూ ఒకడిని అని భావిస్తున్నాను.

పవన్​ నవ్వు ఓ అద్భుతం. ఎంతో స్వచ్ఛమైంది. పత్తికాయ పగలి.. తెల్లటి పత్తి బయటకు వచ్చినప్పుడు.. ఆ తెల్లదనంలో ఎంతటి స్పష్టత, అందం ఉంటుందో.. అలాంటి అందమైన వ్యక్తే పవన్ కల్యాణ్​. ఆ మనిషిలో అంతా మంచితనం, హాస్యం, నవ్వు ఉంటుంది. కావాలనుకునేవారికి ఇష్టమైన అవతారంలో దర్శనమిచ్చే దైవాంశ సంభూతుడతడు. సినిమా సూపర్​ హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇక విశ్వప్రసాద్ గురించి చెప్పాలంటే ఆయన నాకు మంచి స్నేహితుడు. గడ్స్ ఉన్న నిర్మాత. పాన్ వరల్డ్ సినిమా తీయగలగే శక్తి ఉంది" అని బ్రహ్మానందం చెప్పారు. ఆ వెంటనే నిర్మాత విశ్వప్రసాద్ మాట అందుకుని.. 'మా పాన్ వరల్డ్ సినిమా పవన్ కల్యాణ్​తోనే ఉంటుంది' అని స్పష్టత ఇచ్చారు.

ఇదీ చూడండి :

మా వదిన ద్రోహం చేసింది.. రామ్​చరణ్​లా అలా చేయలేను : పవన్ కల్యాణ్​ షాకింగ్ కామెంట్స్!​

''బ్రో' కోసం పవన్ ఉపవాసం.. ఈ సినిమాకు ఆయనే స్ఫూర్తి'

ABOUT THE AUTHOR

...view details