BRO Movie OTT : ప్రతి వారంలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదలై సందడి చేస్తున్నాయి. వీకెండ్స్ దగ్గర పడటం వల్ల మూవీ లవర్స్ అంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో థియేటర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే వీలు చిక్కని ఆడియెన్స్ ఓటీటీల్లోనే సినిమాలు చూస్తూ తమ వీకెండ్స్‌ను గడుపుతుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా సరికొత్త కంటెంట్‌ను విడుదల చేస్తూ అలరిస్తుంటాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా ఇప్పటి వరకు థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటంటే..
Pawan Kalyan Bro Movie OTT Release : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 'బ్రో' పేరిట విడుదలైంది. ఇక తమిళ దర్శకుడు సముద్రఖని ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ డైరెక్ట్ చేశారు.
BRO Movie OTT Release : కేతిక శర్మ, బ్రహ్మానందం, ప్రియా వారియర్, వెన్నెల కిషోర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ ఇప్పుడు తెలుగుతో పాటు మలయాళ, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.