BRO Movie Director : 'బ్రో' సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా కష్టపడ్డారని.. చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఉపవాసం ఉన్నారని డైరెక్టర్ సముద్రఖని తెలిపారు. అయితే పవన్ కల్యాణ్ బ్రో కథ విన్న మూడు రోజుల్లోనే షూటింగ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఒక డైరెక్టర్‌గా తాను ఎంత క్లారిటీతో ఉన్నానో.. పవన్‌కు తొలిరోజు షూటింగ్‌లోనే అర్థమయ్యిందని అన్నారు. అయితే ఉన్న సమయాన్ని కాలక్షేపం చేస్తూ వృథా చేయకుండా.. సెట్లోనే పవన్ కాస్ట్యూమ్స్ మార్చుకునేవారని ఆయన పేర్కొన్నారు. షూటింగ్లో పాల్గొన్నన్ని రోజులు ఉపవాసంతో, నిష్ఠతో పనిచేశారని సముద్రఖని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ సైతం కీలక పాత్రలో నటించారు.
ప్రాజెక్ట్‌లోకి పవన్ - త్రివిక్రమ్ ఎంట్రీ..
'మనం ఏ పని చేయాలన్నా.. కాలం నిర్ణయిస్తుంది. నేను చేసిన 'వినోదయ సిత్తం' రిలీజైన దాదాపు వారం రోజులకు ఓ వృద్ధుడు నాకు ఫోన్ చేశాడు. సినిమా చూసిన ఆ పెద్దాయన ఎంతో ఎమోషనల్ అయ్యి నాతో మాట్లాడారు. అలా మనుషులకు దగ్గరయ్యే ఈ సినిమా తెలుగులో త్రివిక్రమ్ గారి సహకారంతోనే సాధ్యమైంది. అయితే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే పవన్ కల్యాణ్‌తో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్అన్నారు. ఆయన మాటతో చెప్పలేనంత సంతోషం కలిగింది. అలా ఈ సినిమాలోకి త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ వచ్చారు' అని సముద్రఖని అన్నారు.