ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'రంగమార్తాండ'. కృష్ణవంశీ దర్శకుడు. తాజాగా చిత్ర బృందం బ్రహ్మానందంకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను వదిలింది. ఇందులో బ్రహ్మానందం తన గద్గద స్వరంతో చెప్పిన ఎమోషనల్ డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్రహ్మానందం.. ఇలా కన్నీరు పెడుతూ డైలాగ్ చెప్పడం చూశారా? - బ్రహ్మానందం వార్తలు
కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రంగమార్తాండ', 'కీడా కోలా' సినిమాలకు సంబంధించిన టీజర్, పోస్టర్ విడుదలయ్యాయి. అవి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూసేద్దాం.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కీడా కోలా'. విజి సైన్మా పతాకంపై భరత్ కుమార్, శ్రీపాద నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ సాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల తాతని గుర్తు చేసేలా... వరదరాజు పాత్రలో కనిపిస్తారని, ఇదివరకు చూడని ఓ సరికొత్త అవతారంలో ఆయన సందడి చేస్తారని సినీవర్గాలు తెలిపాయి. ఆయన లుక్‌ను విడుదల చేశాయి.
ఇదీ చూడండి:నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్న ప్రాజెక్ట్-కె.. రెండు పార్ట్స్‌గా రిలీజ్ ?