తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ.100కే 'బ్రహ్మాస్త్ర' టికెట్.. ఆ నాలుగు రోజులు మాత్రమే! - undefined

జాతీయ చలనచిత్ర దినోత్సవం రోజున మంచి వసూళ్లు సాధించడంతో 'బ్రహ్మాస్త్ర' మూవీ యూనిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవరాత్రి వేడుకల సందర్భంగా నాలుగు రోజుల పాటు సినిమాను రూ.100కే చూడొచ్చని దర్శకుడు అయాన్​ ముఖర్జీ వెల్లడించారు. ఆ వివరాలు..

brahmastra movie special ticket rates for four days
brahmastra movie special ticket rates for four days

By

Published : Sep 25, 2022, 9:15 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా 'బ్రహ్మాస్త్ర' ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే సెప్టెంబర్ 23వ తేదీన నేషనల్ సినిమా డే సందర్భంగా మూవీ యూనిట్.. కేవలం రూ.75కే టికెట్ ధర నిర్ణయించింది. మల్టీప్లెక్స్​లోనూ రూ.75కే టికెట్లు లభించడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపించారు. దాదాపుగా థియేటర్లలో ఆరోజు 85% ఆక్యుపెన్సీ కనిపించింది. దీంతో టికెట్ రేటు తగ్గిస్తే ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం అర్థం చేసుకున్న సినిమా యూనిట్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రకటన చేసింది.

దసరా శరన్నవరాత్రులు సందర్భంగా ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు సినిమాను కేవలం రూ.100కే చూడొచ్చని దర్శకుడు అయాన్​ ముఖర్జీ పేర్కొన్నారు. కాగా, 'బ్రహ్మస్త్ర' చిత్రంలో టాలీవుడ్​ స్టార్​ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, హీరోయిన్​ మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. క‌ర‌ణ్ జోహార్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించారని సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లు వసూళ్లను రాబట్టిందని తెలిసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details