తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్​ ఈవెంట్​ రద్దు.. అదే కారణమా? - బ్రహ్మాస్త్రం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Brahmastra Prerelease Event : రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా శుక్రవారం సాయంత్రం జరగాల్సిన 'బ్రహ్మాస్త్రం' చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

రద్దయిన బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్​ ఈవెంట్​
రద్దయిన బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్​ ఈవెంట్​

By

Published : Sep 2, 2022, 6:59 PM IST

Brahmastra Prerelease Event : రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా శుక్రవారం సాయంత్రం జరగాల్సిన 'బ్రహ్మాస్త్రం' చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దైంది. అనివార్య కారణంగా వేడుక రద్దైనట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. రాత్రి 8 గంటలకు పార్క్‌ హయత్‌లో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇందులో చిత్ర నటీనటులు, దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొననున్నారు.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సినీ, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో వేదికకు చేరుకున్నారు. ఇప్పుడీ అనూహ్య ప్రకటనతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రూపొందించిన చిత్రమిది. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. సెప్టెంబర్​ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదీ చదవండి: మోహన్​బాబుతో గొడవ.. మరోసారి ఏడుస్తూ మాట్లాడిన బెనర్జీ

ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె'లో మరో ముగ్గురు స్టార్​ హీరోలు, ఇక ఫ్యాన్స్​కు పండగే

ABOUT THE AUTHOR

...view details