తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బ్రహ్మాస్త్ర సీక్వెల్​ నుంచి కీలక అప్డేట్​.. ఇక 2 అండ్​ 3 కూడా..! - brahmastra director ayan mukherjee

పాన్​ ఇండియన్​ చిత్రం 'బ్రహ్మాస్త్ర' మూవీ సీక్వెల్స్​పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అయాన్​ ముఖర్జీ. 2026, 2027 సంవత్సారాల్లో వీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..

brahmastra sequels updates by director ayan mukerji
బ్రహ్మాస్త్రం సినిమా సీక్వెల్స్​పై దర్శకుడు అయాన్​ ముఖర్జీ పోస్ట్​

By

Published : Apr 4, 2023, 3:57 PM IST

Updated : Apr 4, 2023, 5:05 PM IST

'బ్రహ్మాస్త్ర' పాన్​ ఇండియా సినిమాగా తెలుగు, హిందీలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో దీనికి సీక్వెల్స్​గా మరో రెండు పార్ట్​లను కూడా తెరకెక్కిస్తామంటూ మూవీ మేకర్స్​ అధికారికంగా ప్రకటించారు. 2022 సెప్టెంబర్​ 30న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్​లో ఫస్ట్ వీకెండ్​లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. అలాగే తెలుగులోనూ 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ' పేరుతో రిలీజై మంచి పేరును తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2', 'బ్రహ్మాస్త్ర పార్ట్ 3'లు వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వీటికి సంబంధించిన విడుదల తేదీలను ప్రకటించింది మూవీ టీమ్​. పార్ట్​-2ను 2026 డిసెంబరులో, పార్ట్​-3ను 2027 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ వివరాలతో పాటు ఓ పోస్టర్​ కూడా విడుదల చేసింది.

అందుకే 5 ఏళ్లు కష్టపడ్డా..
ఒకేసారి బ్రహ్మాస్త్ర పార్ట్​-2, 3ల షూటింగ్​ను పూర్తి చేసి ఇక వెనువెంటనే ఈ సినిమాలను రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేయనున్నామని డైరెక్టర్ అయన్​ ముఖర్జీ తెలిపారు. రాబోయే సీక్వెల్స్​ మొదటి భాగం కంటే అద్భుతుంగా ఉండనున్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా మొదటి పార్ట్​ కోసం అయాన్​ దాదాపు 5 ఏళ్లు కష్టపడ్డారట. పార్ట్​-1 కోసమే ఇంత కాలం కృషి చేసిన ఆయన.. మరింత గొప్ప చిత్రం రావాలని మిగతా భాగాల కోసం ఇంత సమయం తీసుకుంటున్నారని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

'ఈ సినిమా సీక్వెల్స్​ కోసం మరో మూడేళ్లు వేచి ఉండాలా' అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు​ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 'ఓ గొప్ప చిత్రం బయటకు రావాలంటే కనీసం కొంత సమయమైనా కావాలంటూ' మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బ్రహ్మాస్త్ర పార్ట్​-1 అద్భుతమైన విజువల్​ ఎఫెక్ట్స్​తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. దీంతో మిగతా పార్ట్​లలో మరిన్ని హంగులు జోడించి తెస్తారనే ఆశాభావంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. ఇక అటు థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్​ఫామ్​లోనూ వ్యూస్​ పరంగా ఈ సినిమా పలు రికార్డులను సృష్టించింది.

దర్శకుడు అయాన్​ ముఖర్జీ తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో రణ్​బీర్ కపూర్ సరసన ఆలియా భట్​ నటించారు. స్టార్ స్టూడియోస్​, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్​కు చెందిన అగ్ర హీరోలు బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​, షారుఖ్​ ఖాన్​తో పాటు టాలీవుడ్​ కింగ్​ అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాలో మెరిశారు.

Last Updated : Apr 4, 2023, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details