తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2022, 9:58 PM IST

ETV Bharat / entertainment

భారీ వసూళ్లు రాబట్టిన 'బ్రహ్మాస్త్ర'.. ఇప్పటి వరకు ఎంతంటే..

Brahmastra Box Office Collection : బాయ్​కాట్ ట్రెండ్​ మధ్య మొదలైన 'బ్రహ్మాస్త్ర' సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 225 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.

brahmastra
brahmastra box office collection worldwide day 4

Brahmastra Box Office Collection : రణ్​బీర్ కపూర్​, ఆలియా భట్​ నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.225 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని చిత్ర యూనిట్ తెలిపింది. బాయ్​కాట్​ ట్రెండ్​ను కూడా అదిగమించి భారీ వసూళ్లు సాధిస్తోంది. 'బ్రహ్మాస్త్ర' విజయం వల్ల బాలీవుడ్​కి వరస ఫ్లాప్​ల నుంచి విముక్తి లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గత కొంత కాలంగా బాలీవుడ్​ చిత్ర పరిశ్రమను బాయ్​కాట్​ ట్రెండ్​ కుదిపేస్తోంది. 'బ్రహ్మాస్త్ర' సనిమాకు కూడా బాయ్​కాట్​ సెగ తాకింది. కొన్ని సంవత్సరాల క్రితం రణ్​బీర్​ కపూర్ చేసిన వ్యాఖ్యలు అతడిని వెంటాడుతున్నాయి. ఇటీవల రణ్​బీర్​, ఆలియా ఉజ్జయిని మహాకళేశ్వర్ ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ కొందరు నిరసన చేపట్టారు. దాని తర్వాత సోషల్​ మీడియాలో 'బాయ్​కాట్​ బ్రహ్మాస్త్ర' ట్రెండ్​ మొదలైంది.

బాలీవుడ్​ స్టార్​ నటీనటులు రణ్​బీర్ కపూర్​, ​ఆలియా భట్​ నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ.. శుక్రవారం పాన్​ ఇండియా స్థాయిలో విడుదలైంది. నాన్​ హాలిడే రోజు ఈ మూవీ విడుదలైనప్పటికీ భారీ వసూళ్లు సాధించడం పట్ల చిత్ర యూనిట్​ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8913 స్క్రీన్లల్లో విడుదలైన ఈ మూవీ ఫస్ట్​డే దాదాపు రూ.75 కోట్ల మేరకు వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీతో పాటు అన్ని భాషల్లో సినిమాకు చక్కటి కలెక్షన్స్ వస్తున్నాయని పేర్కొంది. 2డీ వెర్షన్ తో పాటు త్రీడీకి కూడా మంచి ఆదరణ లభిస్తుందని వెల్లడించింది.

ఇవీ చదవండి:విజయ్‌ కొత్త సినిమా అప్డేట్​.. ప్రముఖ నిర్మాణ సంస్థ 100వ ప్రాజెక్టుగా

అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో రెబల్​స్టార్​కు అంతిమవీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details