తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్' రికార్డు​ బద్దలు కొట్టిన 'బ్రహ్మాస్త్ర'.. తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే? - ఆర్​ఆర్​ఆర్​ ఓపెనింగ్​ కలెక్షన్స్​

రణ్​బీర్ కపూర్​, ఆలియా భట్​ నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'ఆర్​ఆర్​ఆర్'​ తొలి రోజు కలెక్షన్ల రికార్డును 'బ్రహ్మస్త్ర' బద్దలు కొట్టిందని సమాచారం.

brahmastra-box-office-collection-day-1-ranbir-alia-film-surpasses-rrr-opening-day-earnings
brahmastra-box-office-collection-day-1-ranbir-alia-film-surpasses-rrr-opening-day-earnings

By

Published : Sep 10, 2022, 12:40 PM IST

Updated : Sep 10, 2022, 4:31 PM IST

Brahmastra First Day Collections : బాలీవుడ్​ స్టార్​ నటీనటులు రణ్​బీర్ కపూర్​, ​ఆలియా భట్​ నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ.. శుక్రవారం పాన్​ ఇండియా స్థాయిలో విడుదలైంది. అయితే ఈ సినిమా మిక్సుడ్​ టాక్​ సంపాదించుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. 'ఆర్ఆర్​ఆర్'​ తొలిరోజు వసూళ్ల రికార్డును 'బ్రహ్మస్త్ర' బద్దలు కొట్టందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

'బ్రహ్మాస్త్ర' కలెక్షన్స్​

నాన్​ హాలిడే రోజు ఈ మూవీ విడుదలైనప్పటికీ భారీ వసూళ్లు సాధించడం పట్ల చిత్ర యూనిట్​ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8913 స్క్రీన్లల్లో విడుదలైన ఈ మూవీ ఫస్ట్​డే దాదాపు రూ.75 కోట్ల మేరకు వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీతో పాటు అన్ని భాషల్లో సినిమాకు చక్కటి కలెక్షన్స్ వస్తున్నాయని పేర్కొంది. 2డీ వెర్షన్ తో పాటు త్రీడీకి కూడా చక్కటి ఆదరణ లభిస్తుందని వెల్లడించింది. అయితే సినిమాలో మాత్రం ఏదో తెలియని లోటుందని అంటున్నారు. 'బ్రహ్మాస్త్ర' సినిమాకు బాయ్​కాట్​ సెగ బాగా తగిలిందని అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Sep 10, 2022, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details