Brahmanandam Second Son Marriage Photos : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు, సినీ ప్రియులు 'హాస్య బ్రహ్మ' అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం మే నెలలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వివాహ వేడుక కూడా గ్రాండ్‌గా జరిగింది. ఆయన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను వివాహమాడారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుక జరిగింది.
ఈ పెళ్లి వేడుకకు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సినీ పెద్దలు చాలా మంది విచ్చేసి నూతన వధూవరులను(Brahmanandam Second Son Wedding) ఆశీర్వదించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటులు నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరై సందడి చేశారు. ఇకపోతే నూతన పెళ్లి కొడుకు సిద్ధార్థ్ విషయానికొస్తే.. ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడినట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య కూడా డాక్టరేనట. గైనకాలజీ చేసిందని తెలిసింది.