తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Boyapati Srinu Upcoming Movies : బోయపాటి లైనప్‌... మహేశ్​-సూర్యతో సినిమా.. ఎప్పుడంటే? - Boyapati Srinu with Mahesh babu

Boyapati Srinu Upcoming Movies : త్వరలోనే తాను చేయనున్న సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ వివరాలు..

Boyapati Srinu Upcoming Movies : బోయపాటి లైనప్‌... మహేశ్​-సూర్యతో సినిమాలు ఎప్పుడంటే?
Boyapati Srinu Upcoming Movies : బోయపాటి లైనప్‌... మహేశ్​-సూర్యతో సినిమాలు ఎప్పుడంటే?

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 5:47 PM IST

Boyapati Srinu Upcoming Movies :టాలీవుడ్​లో ఊర మాస్‌ యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్​​ బోయపాటి శ్రీను. ఆయన మేకింగ్ విధానం కూడా ఎంతో పవర్​ ఫుల్​గా ఉంటుంది. ఇప్పటికే ఆయన ​నందమూరి నటసింహం బాలకృష్ణ, ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌, మెగా పవర్ స్టార్​ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌ వంటి స్టార్​ హీరోస్​తో సినిమాలను తెరకెక్కించారు. రీసెంట్​గా ఉస్తాద్​ రామ్​ పోతినేని హీరోగా 'స్కంద'తో ప్రేక్షకులను అలరించిన ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. 'అఖండ 2' గురించి కూడా మాట్లాడారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కూడా ఓ సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Boyapati Mahesh Babu Movie :"సూర్య, అల్లు అర్జున్‌తో త్వరలోనే సినిమాలు చేయబోతున్నాను. ఎవరి డేట్స్‌ ముందు దొరికితే వాళ్లతో నా సినిమా చేసేస్తాను. ఈ రెండూ కంప్లీట్ అయ్యాక 'అఖండ 2' పట్టాలెక్కిస్తాను. మహేశ్‌ బాబుతో ఇప్పటికే పలు కథల గురించి చర్చించాను. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఇంకా సినిమా సెట్​ కాలేదు. మహేశ్‌.. అన్నిరకాలు పాత్రలు పోషించగల ఆల్‌ రౌండర్‌ యాక్టర్​. ఆయనతో తప్పకుండా ఒక కమర్షియల్‌ చిత్రాన్ని చేస్తాను" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బోయపాటి చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Boyapati Mahesh Babu Movie :కాగా, ఇప్పటికే అల్లు అర్జున్‌ - బోయపాటి కాంబోలో వచ్చిన 'సరైనోడు' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 'అఖండ' విషయానికి వస్తే.. బాలకృష్ణ డబుల్​ రోల్​లో నటించిన ఈ సినిమా 2021లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇక, బోయపాటి శ్రీను తెరకెక్కించిన రీసెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్కంద సెప్టెంబర్ 28న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. రామ్​ కెరీర్​లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్​ను తెచ్చిపెట్టింది. రామ్​ పవర్​ ఫుల్​ మాస్ రోల్​లో కనిపించి మెప్పించారు. ఇక శ్రీలీల హీరోయిన్​గా నటించి ఆకట్టుకుంది.

Varun Tej Lavanya Pre Wedding : చిరంజీవి ఇంట్లో వరుణ్​- లావణ్య ప్రీవెడ్డింగ్​ సెలబ్రేషన్స్​.. మస్త్​ ఎంజాయ్​ చేశారుగా!

Skanda Movie Review : రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?

ABOUT THE AUTHOR

...view details