రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించాల్సిన పాన్ ఇండియా చిత్రం షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 'స్రవంతి' రవికిశోర్ తొలి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం రామ్ 'ది వారియర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే.. బోయపాటి మూవీ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
రామ్- బోయపాటి మూవీ షూటింగ్ షురూ.. '7 డేస్ 6 నైట్స్' రిలీజ్ అప్డేట్ - 7days 6nights telugu movie
రామ్- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎంఎస్ రాజు తెరకెక్కించిన '7 డేస్ 6 నైట్స్' మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు.

రామ్- బోయపాటి మూవీ షూటింగ్ షురూ.. '7 డేస్ 6 నైట్స్' రిలీజ్
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ '7 డేస్ 6 నైట్స్'. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూన్ 24వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఇదీ చదవండి:'కార్తికేయ 2' మోషన్ పోస్టర్ రిలీజ్.. 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్-2పై డైరెక్టర్ క్లారిటీ
Last Updated : Jun 1, 2022, 2:26 PM IST