వేసవిలో సినీ వినోదాన్ని పంచేందుకు రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. ఒకే రోజు మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'తో రానుండగా.. మరోవైపు తలైవా రజనీకాంత్ 'జైలర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రజనీకాంత్ X చిరంజీవి.. ఒకే రోజు విడుదల కానున్న రెండు బడా సినిమాలు! - భోళా శంకర్ చిరంజీవి
వచ్చే ఏడాది వేసవిలో ఇద్దరు సూపర్‌స్టార్స్ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి హీరోగా నటించిన 'భోళాశంకర్', రజనీకాంత్ 'జైలర్' ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బీస్ట్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న 'జైలర్' సినిమాలో రజనీకాంత్ జైలర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ద్విభాషా సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మణ సంస్థ భావిస్తోంది.
సరిగ్గా అదే రోజున తెలుగులో చిరంజీవి 'భోళాశంకర్' సినిమా విడుదలకు సిద్ధం కానుంది. తమిళ చిత్రం'వేదాళం'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. 'భోళాశంకర్' కారణంగా 'జైలర్' తెలుగు వెర్షన్ కలెక్షన్స్‌కు పెద్దదెబ్బ పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తమిళంలో ఓపెనింగ్స్‌కు ఇబ్బంది ఉండదు కానీ తెలుగు వెర్షన్‌కే సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.