తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అందుకే హిందీలో రీమేక్‌ సినిమాలు హిట్‌ కావట్లేదా? - janvikapoor mili movie updates

ప్రముఖ బాలీవుడ్​ బడా నిర్మాత బోనీ కపూర్​ గురించి తెలియని వారెవరుండరు. తన కూతురు జాన్వీకపూర్ నటించిన​ ఓ రీమేక్​ సినిమా 'మిలీ' ప్రేక్షులముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా రీమేక్​ల గురించి బోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే..

boney kapoor
బోనీ కపూర్‌

By

Published : Oct 31, 2022, 6:49 PM IST

ఓ భాషలో హిట్‌ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్‌ చేయటం ఎప్పటి నుంచో ఉన్న పద్ధతే. కానీ, ఒకప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. దక్షిణాది భాషల్లో హిట్​ కొట్టిన పలు చిత్రాలను హిందీలో పునః నిర్మించగా అవి అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'మిలీ'సినిమా ప్రచారంలో భాగంగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ ఈ విషయమై స్పందించారు. 'జెర్సీ'(తెలుగు), విక్రమ్‌ వేద (తమిళం)లను ఉదాహరణగా తీసుకుంటూ.. "ఈ రెండు సినిమాలు ఆయా భాషల్లో హిట్‌గా నిలిచాయి. వాటి రీమేక్‌ (హిందీ)లు మాత్రం బాక్సాఫీసు వద్ద హిట్​ సాధించలేకపోయింది. స్థానికతకు తగ్గట్టు ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు (కాపీ- పేస్ట్‌) తెరకెక్కించడమే ఫెయిల్యూర్‌కు కారణం. పైగా టైటిల్‌నూ మార్చట్లేదు. హిందీ ప్రేక్షకుల అభిరుచి మేరకు స్క్రిప్టును కొంత మారిస్తే ఫలితం ఉంటుంది" అని బోనీ కపూర్‌ తెలిపారు.

తన కూతురు జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో బోనీ నిర్మించిన చిత్రమే 'మిలీ'. సన్నీ కౌశల్‌, మనోజ్‌ పవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుకోని పరిస్థితుల్లో మైనస్‌ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ చిత్రం 'హెలెన్‌'కు రీమేక్‌. మాతృకకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియరే 'మిలీ'కీ దర్శకుడు. నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇటీవల, 'గుడ్‌లక్‌ జెర్రీ'తో ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. అది తమిళ సినిమా 'కొలమావు కోకిల' రీమేక్‌.

ABOUT THE AUTHOR

...view details