తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వాళ్లకంటే నేనే గొప్ప నటిని.. కొత్తలో బ్లాక్‌ క్యాట్‌, డస్కీ అనేవారు' - alia bhat heart stone

బాలీవుడ్​లో వెలిగి.. హాలీవుడ్​లోనూ తమ సత్తా చాటుతున్నారు ప్రియాంక చోప్రా, అలియా భట్. తాజాగా వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అవేంటంటే..

stars priyanka chopra and alia bhat
stars priyanka chopra and alia bhat

By

Published : Dec 8, 2022, 7:14 AM IST

చాలా వేగంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా. ఆమె నటి, నిర్మాత, రచయిత్రి, గాయకురాలు, వ్యాపార వేత్త ఇలా పలు విధాలుగా తనను తాను ఆవిష్కరించుకుంది. అందాల దేవత, అపూర్వ సుందరి ఇలా ఎన్నో రకాలుగా ఆమె కీర్తిస్తుంది సినీ లోకం. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె శరీర రంగు మీద మనసు గాయపడేలా వ్యాఖ్యలు చేసేవారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పంచుకుంది. "సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బ్లాక్‌ క్యాట్‌, డస్కీ అంటూ కొందరు నన్ను విమర్శించేవారు. నా కంటే మంచి రంగున్న నాయికలు చాలామంది కంటే నేను గొప్ప నటినే అని నా భావనతో జీవితంలో ముందుకెళ్లిపోయాను. అప్పుడు ఆ విమర్శల్ని పట్టించుకునుంటే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదేమో" అని చెప్పింది ప్రియాంక. కెరీయర్‌ కొత్తలో హీరోల పారితోషికంలో పదిశాతం కూడా నాకు దక్కేది కాదు అంటూ పారితోషికం విషయంలోనూ వివక్ష గురించి మనసులో మాటను ఆమె పంచుకుంది.

నా జీవితంలో చాలా మార్పులే వచ్చాయి..
యువతరంలో మంచి క్రేజ్‌ ఉన్నాసరే గ్లామర్‌ పాత్రలకంటే కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించి తన కెరీర్‌ను కొత్తదారిలో తీసుకెళ్లింది అలియా భట్‌. ఇటీవల తల్లై మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. తల్లయ్యాకా తన ఆలోచన తీరులో చాలా మార్పులొచ్చాయని చెబుతోంది అలియా. "తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. దీంతో నా వ్యక్తిగత జీవితంలో చాలా భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు కంటే స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాను. అది ఎందుకు? ఎలా? అనే విషయాలు ఇంకా నాకే తెలియడం లేదు. నా ఈ తీరు నా సినిమా జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా నాకు తెలియదు. పాత్రల ఎంపికలో కూడా నా నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడే చెప్పలేను. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నేనే ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది అలియా. ఆమె కరణ్‌జోహార్‌ చిత్రం 'రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ'తో పాటు హాలీవుడ్‌ చిత్రం 'హార్ట్‌ స్టోన్‌' తదితర చిత్రాల్లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details