తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Arjit Singh Injury : సింగర్​ను గాయపరిచిన మహిళా అభిమాని.. షేక్​ హ్యాండ్​ ఇస్తూ.. - అర్జిత్ సింగ్ గాయం

బాలీవుడ్ స్టార్​ సింగర్​ అర్జిత్ సింగ్​కు కాన్సర్ట్​లో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని చూపిన అత్యుత్సాహం వల్ల ఆయన చేతికి గాయమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Etv Bharat
Etv Bharat

By

Published : May 9, 2023, 10:31 AM IST

బాలీవుడ్​ స్టార్​ సింగర్​ అర్జిత్​ సింగ్​ ఇటీవలే మహారాష్ట్ర ఔరంగాబాద్​లో ఓ లైవ్ కాన్సర్ట్ నిర్వాహించారు. ఇందులో భాగంగా అభిమానుల కోసం పలు పాటలు పాడారు. అయితే సాధారణంగా ఆయన కాన్సర్ట్​లు చేస్తున్న సమయంలో.. పాటలు పాడుతూ అప్పుడప్పుడు తన అభిమానులను పలకరిస్తుంటారు. అలానే సోమవారం జరిగిన కాన్సర్ట్​లో కూడా ఆయన స్టేజీ పై నుంచే అభిమానులను పలకరిస్తూ వచ్చారు.

Arjit Singh concert :ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అర్జిత్​కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అలా ఇస్తున్న సమయంలో ఆయన చెయ్యి పట్టుకొని గట్టిగా ఊపేసి, లాగేసింది. ఆమె చూపిన అత్యుత్సాహం వల్ల అర్జిత్ అదుపు తప్పి పడబోయారు. ఇక అదే సమయంలో ఆయన చేతికి గాయమైంది. ఆ అభిమాని చెయ్యి గట్టిగా లాగడం వల్ల ఆయన చెయ్యి బెణికినట్టు సమాచారం.

Arjit Singh Injury : ఈ విషయంపై ఆగ్రహించిన అభిమానులు సోషల్​ మీడియా వేదికగా ఆ లేడీ ఫ్యాన్​ను తిట్టిపోస్తున్నారు. అయితే ఆయన ప్రోగ్రాం చేస్తున్న సమయంలోనే చెయ్యి నొప్పితో బాధపడినట్టు తెలుస్తోంది. ఇక మరుసటి రోజు ఉదయం అర్జిత్ సింగ్ చేతికి కట్టుతో కనిపించేసరికి అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే చెయ్యి బెణికినందుకు కట్టు కట్టిన డాక్టర్లు.. కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలని, కోలుకునే దాకా గిటార్ వాయించకూడదని సూచించారట. దీంతో ఆయన అభిమానులు అర్జిత్​ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. గెట్​ వెల్​ సూన్​ సూపర్​స్టార్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Arjit Singh songs : ఇక అర్జిత్ సాంగ్స్​ జర్నీని చూస్తే.. సౌత్​తో పాటు నార్త్​లోనూ పలు ఫేమస్​ సాంగ్స్​ను పాడారు. భాషతో సంబంధం లేకుండా కేవలం ఆయన పాటలకే సెపరేట్​ ఫ్యాన్​బేస్​ ఉంది. 'ఆషీకీ 2'తో పాపులరైన ఈయన.. ఆ సినిమా తర్వాత నుంచి వరుసగా హిందీతో పాటు అనేక భాషల్లో సాంగ్స్ పాడి అందరినీ ఆకట్టుకున్నారు. 'ఉయ్యాల జంపాల', 'దోచేయ్', 'స్వామి రారా', 'హుషారు', 'భలే మంచి రోజు' లాంటి పలు తెలుగు సినిమాల్లోని పాటలకు ఆయన స్వరాన్ని అందించి మ్యూజిక్​ లవర్స్​ను మెప్పించారు. ఇటీవలే వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాలో పలు పాటలతో ఫ్యాన్స్​కు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా 'కేసరియా' సాంగ్​తో మ్యాజిక్​ చేశారనే చెప్పాలి. సినిమా పాటలే కాకుండా ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్​లోనూ పాడారు. ఇక ప్రైవేట్ ప్రోగ్రామ్స్​తో పాటు కాన్సర్ట్స్​ ద్వారా అభిమానులను అలరిస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details