ఇప్పటికే రిలీజైన పాటలతో బాలీవుడ్లో క్రేజ్‌తో పాటు కాంట్రవర్సీలను తెచ్చుకున్న 'పఠాన్' మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మూవీ ట్రైలర్ ఎట్టకేలకు మంగళవారం రిలీజయ్యింది. దీంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తెలుగు, హిందీ, తమిళం ఇలా మూడు భాషల్లో రిలీజైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో షారుక్ లుక్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటూ అభిమానులు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.
'వనవాసాన్ని ముగించుకుని వస్తున్నాడు'.. హైఓల్టేజ్ పఠాన్ ట్రైలర్ చూశారా? - పఠాన్ మూవీ తెలుగు ట్రైలర్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకుణె జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ పఠాన్. ఇప్పటికే రిలీజైన పాటలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ ట్రైలర్ మంగళవారం రిలీజయ్యింది.
pathaan
జాన్ అబ్రహం నేతృత్వంలోని ఒక ప్రైవేట్ టెర్రర్ గ్రూప్ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన మిషన్‌ను వివరిస్తూ డింపుల్ కపాడియా వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'అతనితో పోరాడటానికి పఠాన్ ఉన్నాడు. అతను తన వానవాసాన్ని పూర్తి చేసుకుని వస్తున్నాడు'.. అంటూ ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికంగా సాగింది. ఇందులో షారుక్‌తో పాటు దీపిక, జాన్ అబ్రహాంలు యాక్షన్ సీన్స్‌లో మెరిశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.