బాలీవుడ్ గ్లామర్ అండ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. తాను గతంలో నటించిన వార్ సినిమాకు శారీరకంగా చాలా కష్టపడటంతో డిప్రెషన్‌కు గురయ్యారని చెప్పారు. ఒకానొక సమయంలో చనిపోతాననుకున్నాని అన్నారు. ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ చేసిన ఇంటర్వ్యూ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
"ఆ సినిమా కోసం అప్పుడు నేను సిద్ధంగా లేను. పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవడం నాకో సవాల్‌గా అనిపించింది. పర్‌ఫెక్షన్ కోసం ఎంతగానో ప్రయత్నించా. సినిమా చిత్రీకరణ పూర్తయ్యేనాటికి తీవ్రంగా అలసిపోయా. డిప్రెషన్ అంచులకు వెళ్లొచ్చా. నా జీవితంలో మార్పు అవసరమని అప్పుడే అనుకున్నా" అని హృతిక్ వివరించారు. అనంతరం, హృతిక్‌కు ఇచ్చిన శిక్షణను గెతిన్ గుర్తు చేసుకున్నారు. 2013లో తన దగ్గర శిక్షణ తీసుకున్న 7 నెలల్లో ఏ ఒక్కరోజూ హృతిక్ విరామం తీసుకోలేదన్నారు.