తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​కు తండ్రిగా బాలీవుడ్​ సీనియర్​ హీరో! - అనిల్​కపూర్​ మహేశ్ త్రివిక్రమ్​ సినిమా

Mahesh babu Trivikram movie: మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో బాలీవుడ్​ సీనియర్​ హీరో నటించనున్నారని తెలిసింది. మహేశ్​కు తండ్రిగా ఆయన కనిపించబోతున్నారట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

anilkapoor in Mahesh babu Trivirkam movie
anilkapoor in Mahesh babu Trivirkam movie

By

Published : Apr 18, 2022, 9:09 AM IST

Mahesh babu Trivikram movie: ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ నటులు టాలీవుడ్‌లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. త్వరలో దీపికా పదుకొణె, సైఫ్ అలీ ఖాన్‌ తదితరులు కూడా ఇక్కడి వారిని పలకరించబోతున్నారు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్‌ తెలుగు తెరపై అలరించేందుకు సిద్ధమయ్యారని ఫిల్మ్‌ వర్గాలు అంటున్నాయి. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్నఈ చిత్రంలోనే.. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పలు ఆంగ్ల వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. ఈ ప్రాజెక్ట్​లో మహేశ్​కు తండ్రిగా మలయాళ మెగాస్టార్​ మోహన్​లాల్​ నటిస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడా పాత్రలోనే అనిల్​కపూర్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట! ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. అనిల్​కపూర్​ తెలుగులో బాపు దర్శకత్వంలో 'వంశవృక్షం' అనే సినిమా చేశారు. ఇది అప్పట్లో హిట్​గా నిలిచింది.

మహేశ్​.. ప్రస్తుతం పరుశురామ్​ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. గతంలోనూ ఈ చిత్రంలో అనిల్​కపూర్​ విలన్​గా కనిపిస్తారని ప్రచారం సాగింది. కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. మే 12న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

ఇక మహేశ్​-త్రివిక్రమ్​ సినిమా విషయానికొస్తే.. దీన్ని ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా అభిమానులను సంతోషపెట్టే మరో వార్త మరొకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. జూన్​ నుంచి షూటింగ్​ ప్రారంభించేందుకు మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారని తెలిసింది. ముందుగా మహేశ్​పై ఓ సోలో సాంగ్, ఓ ఫైట్​ను చిత్రీకరించబోతున్నారట! ఆ తర్వాత లాంగ్​ షెడ్యూల్​ ఉంటుందని తెలిసింది.

ఇదీ చూడండి: Acharya movie: 'అందులో ఎలాంటి నిజం లేదు'

ABOUT THE AUTHOR

...view details