Pushpa 2 Sunil shetty: 'పుష్ప: ది రైజ్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా 'పార్ట్-2' కూడా విడుదలవుతుందని బృందం ఇప్పటికే ప్రకటించింది. 'పుష్ప: ది రూల్' టైటిల్‌తో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తొలి భాగాన్ని మించేలా తీయాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారట! ఈ క్రమంలోనే కథలో కొన్ని మార్పులు కూడా చేశారని తెలిసింది. తాజాగా ఈ మూవీ గురించి మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. 'పుష్ప 2'లో భన్వర్ సింగ్(ఫహద్ ఫాజిల్) పాత్రతో పాటు మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందట. ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటికే సునీల్ శెట్టి పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించారు. రీసెంట్గా వరుణ్ తేజ్ 'గని'లోనూ ఆయన బాక్సర్ కనిపించి ఆకట్టుకున్నారు.
'పుష్ప 2'లో బాలీవుడ్ సీనియర్ హీరో! - Sunil Shetty latest news
Pushpa 2 Sunil shetty: అల్లుఅర్జున్ నటించనున్న 'పుష్ప 2'లోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిని తీసుకోబోతున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
'పుష్ప 2'లో బాలీవుడ్ సీనియర్ హీరో
కాగా, తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు. దీంతో మలి భాగంలో ఏం చూపించబోతున్నారా? అన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది.