Kangana Ranaut Karan Johar : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఎవరినో ఒకరిపై కామెంట్ చేస్తూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. బీటౌన్‌లో తాజాగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' అనే సినిమా విడుదలైన తరుణంలో ఆమె ఆ సినిమా దర్శకుడు కరణ్ జోహార్‌తో పాటు హీరో రణ్‌వీర్ సింగ్‌కు చురకలు అంటించారు. సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో ఘాటు విమర్శలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లా?
Kangana Ranaut Insta Story :కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్స్‌లో తెరక్కెక్కిన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' సినిమా జూలై 28న గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి రోజు సుమారు రూ.11 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. అయితే ఈ విషయంపై దీనిపై మూవీ క్రిటిక్ గిరీశ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ', 'బ్రో' లాంటి సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా ఆడటం లేదు. అందుకనేమో అందరి కళ్లు వంద కోట్లకు చేరువలో ఉన్న హాలీవుడ్ మూవీ 'ఓపెన్‌హైమర్' మీదే ఉంది' అంటూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. ఇక ఈ విషయంపై స్పందించిన కంగనా.. ఆ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా సినిమాపై విమర్శలు గుప్పించారు.