తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షారుక్​ ఖాన్​కు​ మరో అరుదైన ఘనత.. ఆ జాబితాలో నెం.1గా - షారుక్​ ఖాన్​ టైమ్​ మ్యాగజైన్​

'పఠాన్' సినిమా బ్లాక్​ బస్టర్​తో ఫుల్​ జోష్​ మీదున్న బాలీవుడ్ బాద్​ షా షారుక్​ ఖాన్ మరో అరుదైన ఘనత సాధించారు. ఆ వివరాలు..

sharukh khan time magzine
షారుక్​ ఖాన్​ టైమ్​ మ్యాగజైన్​

By

Published : Apr 7, 2023, 2:02 PM IST

Updated : Apr 7, 2023, 2:11 PM IST

'పఠాన్​' చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో దూసుకెళ్తున్న బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌కు మరో గౌరవం దక్కింది. అమెరికన్ వార్తాపత్రిక టైమ్ మ్యాగజైన్ వార్షిక టైమ్‌-100 జాబితాలో షారుక్​ అగ్రస్థానంలో నిలిచారు. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల కోసం నిర్వహించిన ఈ పోల్‌లో అత్యధికమంది టైమ్ మ్యాగజైన్ పాఠకులు.. ఈ బాద్‌షాకే ఓటు వేశారు. ఈ పోల్‌లో మెుత్తం 12లక్షల మంది ఓటువేయగా అందులో 4 శాతం షారుక్‌ ఖాన్‌కే దక్కాయని టైమ్ మ్యాగజైన్ వెల్లడించింది. ఈ జనవరిలో విడుదలైన పఠాన్‌ చిత్రం అంతర్జాతీయంగా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. వరల్డ్‌వైడ్‌గా పఠాన్ చిత్రం ఇప్పటివరకు మొత్తంగా వెయ్యికోట్లు వసూలు చేసింది.

ఇక ఈ జాబితాలో 3 శాతం ఓట్లతో ఇరాన్ మహిళలు రెండో స్థానంలో నిలిచారు. హిజాబ్ సరిగా ధరించని కారణంగా ఇరాన్‌లో 22ఏళ్ల మహ్సా అమినీ అనే యువతిని పోలీసులు కొట్టిచంపడంతో.. అక్కడ ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా మహిళలు నిరసన తెలిపారు. ఇక 1.9 శాతం ఓట్లతో బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్ హ్యారీ మూడోస్థానంలో... ఆయన భార్య మేఘన్ మార్క్‌లే నాలుగో స్థానంలో నిలిచారు. 1.8 శాతం ఓట్లతో ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ ఐదోస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ పోల్‌లో ఆస్కార్‌ విజేత మిచెల్ యోహ్‌, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సెరేనా విలియమ్స్, మెటా సీఈఓ మార్క్ జూకర్‌ బర్గ్‌, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ఉన్నారు. ఏడాది కాలంలో ఆయా వ్యక్తులు సమాజంపై చూపిన ప్రభావం ఆధారంగా "ప‌ర్సన్ ఆఫ్ ది ఇయ‌ర్‌ను ఎంపిక చేసి.. టైమ్‌ మ్యాగజైన్... కవర్‌పేజీపై వారి ఫొటోను ముద్రిస్తుంది.

కాగా, షారుక్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్​ సినిమా చేస్తున్నారు. బాద్​ షా సరసన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె బికినీ షో కూడా చేయనుందట. ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ కూడా కెమియో రోల్​లో కనిపిస్తారనే గతంలో ప్రచారం సాగింది. అలానే దళపతి విజయ్​ కూడా కనిపిస్తారట. ఇకపోతే ఈ చిత్రంతో ఆయన సల్మాన్ 'టైగర్​ 3'లో అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో పాటు సామాజిక అంశాలే ఇతివృత్తంగా చేసుకొని హృదయానికి హత్తుకునేలా సినిమాలను రూపొందించే దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణితో డంకీ అనే సినిమా చేయనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా 2023 డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి:ప్రభాస్​ వల్ల రాజమౌళిని తిడుతున్న డైరెక్టర్స్.. ఎందుకంటే?​

Last Updated : Apr 7, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details