Shahrukh Khan Ask Me SRK : బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తన అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'ఆస్క్ మీ షారుక్' అంటూ ట్విట్టర్ చాట్ సెషన్ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సుమారు 15 నిమిషాల పాటు ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు బాద్షా.. తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్.."మీరు విజయ్ దళపతితో దిగిన ఫొటో చూస్తే చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందా?" అంటూ ప్రశ్నించారు. దీనికి షారుక్ స్పందిస్తూ.. " ఆయన చాలా మంచి వ్యక్తి. సినిమా అంటే చెప్పలేం. అయితే అవ్వొచ్చు.. లేకపోతే లేదు" అని షారుక్ బదులిచ్చారు.
మీరు అంత హాట్‌గా ఉండడానికి కారణమేంటి?
షారుక్: అదంతా పేరీ పేరీ సాస్‌తో చికెన్ తినడం వల్లే అనుకుంటా.
కొవిడ్ తర్వాత మీలో వచ్చిన మార్పులేమిటి?
షారుక్: అన్నింటి పనులను తొందరిగా పూర్తి చేయాలనే తపనను తగ్గించుకుంటున్నాను.
ఏ వీడియో గేమ్ మీరు ఆడుతున్నారు?
షారుక్:నా చిన్న కుమారుడు ఆడుతున్న ఫోర్ట్‌నైట్ వీడియో గేమ్‌ను నేను కూడా ఆడుతున్నాను.
2007 ఫైనల్‌లో భారత్ గెలిచినప్పుడు మేము మిమ్మల్ని స్టేడియంలో చూశాము. ఇప్పుడు టీమ్ఇండియా మళ్లీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, మీరు మ్యాచ్ చూడడానికి వెళ్తారా?
షారుక్: అంతా దేవుడి దయ. టీమ్ఇండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది.
జాన్ అబ్రహం, సిద్ధార్థ్ ఆనంద్, దీపికా పదుకొణెలతో వర్క్ చేయడం ఎలా ఉంది?
షారుక్: వాళ్లందరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.