తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గంగూలీ బయోపిక్​లో రణ్​బీర్ కపూర్​?​.. ఇదిగో క్లారిటీ! - ranbir kapoor act in ganguly bio pic

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సౌరభ్​ గంగూలీ బయోపిక్​లో బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​ నటిస్తున్నారంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై తాజాగా రణ్​బీర్​ క్లారిటీ ఇచ్చారు. ఏమన్నారంటే?

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 27, 2023, 4:00 PM IST

Updated : Feb 27, 2023, 4:12 PM IST

బాలీవుడ్​ నటుడు రణ్​బీర్​ కపూర్​.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తన కొత్త చిత్రం తూ ఝూతి మైన్​ మక్కార్​ సినిమా ప్రమోషన్స్​లో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా రణ్​బీర్​.. టీమ్​ఇండియా మాజీ దిగ్గజం సౌరభ్​ గంగూలీని కలిశారు. ఆ సమయంలో వారిద్దరూ కలిపి సరదాగా కాసేపు క్రికెట్​ ఆడారు. అందుకు సంబంధించిన చిత్రాలు.. సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.

దీంతో నెటిజన్లు.. గంగూలీ బయోపిక్​పై గుసగుసలు మొదలుపెట్టారు. గంగూలీ బయోపిక్​లో రణబీర్​ నటిస్తున్నారంటూ మాట్లాడుకున్నారు. వాటిని గమనించిన రణబీర్.. గంగూలీ బయోపిక్​లో తన పాత్ర గురించి​ క్లారిటీ ఇచ్చారు. "సౌరభ్​ గంగూలీని లివింగ్​ లెజెండ్​గా నేను భావిస్తున్నాను. అలాంటి వ్యక్తి బయోపిక్​ చాలా స్పెషల్​గా ఉంటుంది. గంగూలీ బయోపిక్​కు సంబంధించి నాకు ఎలాంటి ఆఫర్​ రాలేదు. లవ్​ ఫిల్మ్స్​ నిర్మాణ సంస్థ.. గంగూలీ బయోపిక్​పై వర్క్​ చేస్తున్నారని తెలిసింది. అయితే నేను ప్రముఖ లెజెండరీ గాయకుడు, నటుడు కిషోర్ కుమార్ బయోపిక్​లో నటించబోతున్నాను. గత 11 ఏళ్లుగా కిషోర్ కుమార్ బయోపిక్​పై పనిచేస్తున్నాను" అని రణ్​బీర్​ తెలిపారు.

మైదానంలో గంగూలీ, రణ్​బీర్​
స్పెషల్​ జెర్సీల్లో గంగూలీ, రణ్​బీర్​

ప్రస్తుతం తన తదుపరి చిత్రం తూ ఝూతి మైన్ మక్కార్ ప్రమోషన్స్​లో రణ్​బీర్​ బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీలో తొలిసారిగా ఆయన శ్రద్దాకపూర్​తో జతకట్టనున్నారు. దీంతో వీరిద్దరి మ్యాజికల్ కెమిస్ట్రీని తెరపై చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Last Updated : Feb 27, 2023, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details