Hritik Wishes Ntr : మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా పలువురు స్టార్స్ ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా విషెస్ తెలిపారు. అయితే అందరిలానే విష్ చేసినప్పటికీ ఓ స్టార్ హీరో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ 'వార్' హీరో హృతిక్ రోషన్. ఆయన తెలుగులో ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు.
" హ్యాపీ బర్త్ డే తారక్. ఈ ఏడాది నీకు ఆనందంగా, యాక్షన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాను. నేను కలిసే వరకు నీ రోజులన్నీ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. రాశాడు. దీంతో ఆయన కచ్చితంగా వార్ సినిమా గురించే ఇందులో ప్రస్థావించారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వార్ అనే పదం వాడకుండా యుద్ధభూమి అని రాయడం వల్ల ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'వార్'కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు. దీన్ని 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కాగా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్.. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్‌పై తీసుకురానుంది.