Bipasha Basu Baby: బాలీవుడ్ సెలబ్రిటీ జోడీ బిపాస బసు, కరణ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. శనివారం బిపాస పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాస బసు - బిపాస బసు ఆడబిడ్డ
Bipasha Basu Baby: బాలీవుడ్ సెలబ్రిటీ జోడీ బిపాస బసు, కరణ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. శనివారం బిపాస పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Bipasha Basu Baby
తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది బిపాస బసు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను 2016లో వివాహం చేసుకుంది. వీరిద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లైన ఆరేళ్ల తర్వాత ఆగస్టు నెలలో తన బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది బిపాస బసు. సినిమాల పరంగా చూసుకుంటే.. బిపాస చివరిసారిగా మినీసిరీస్ 'డేంజరస్'లో కనిపించగా, కరణ్ 'క్వాబూల్ హై 2.0' వెబ్‌సిరీస్‌లో నటించారు.
Last Updated : Nov 12, 2022, 3:49 PM IST