బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా దూసుకెళ్తున్నారు. తన అంద చందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బీ టౌన్ బ్యూటీ ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ.. కెరీర్ పరంగా మంచి పొజిషన్‌కు చేరుకున్నారు. అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఇండియన్ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్లో నటించారు. ఈ క్రమంలో సిరీస్ ప్రమోషన్ షోలో పాల్గొన్న ఆమె.. తన మాజీ ప్రియుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మాజీ ప్రియులంతా మంచివారని, ఎంతో గొప్పవారంటూ చెప్పుకొచ్చారు.
"నేను ఓ బంధం నుంచి మరో బంధానికి మారుతూ వచ్చాను. వాటన్నింటికి మధ్య పెద్ద గ్యాప్ కూడా తీసుకోలేదు. నేను ఎంతో బిజీగా పనిచేసేదాన్ని. దీంతో నేను కలసి పనిచేసిన నటులతో, సెట్లో నాతో కలిసిన వారితో డేటింగ్ చేసేదాన్ని. రిలేషన్షిప్ ఎలా ఉండాలనే విషయంపై నాకు ఓ ఆలోచన ఉందనుకున్నాను. దాంతో నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు నాకు తగినట్టుగానే ఉన్నారా? అనేది తెలుసుకోవాలని అనుకున్నాను. గొప్ప వ్యక్తులతో నేను డేట్ చేశాను. నిజమే కొందరితో ఆ బంధాలు విషాదంగా ముగిసి ఉండొచ్చు. కానీ నేను నా జీవితంలో డేటింగ్ చేసిన వారు నిజంగా అద్భుతమైనవారు" అని ప్రియాంక పేర్కొన్నారు. ఇక చివరి బోయ్ ఫ్రెండ్‌కు, నిక్ జోనాస్‌కు మధ్య రెండేళ్ల విరామం తీసుకున్నట్టు కూడా వెల్లడించారు. దీని వెనుక పెద్ద కారణం ఉందంటూ చెప్పుకొచ్చారు. నిక్‌తో లవ్ లైఫ్ ఎలా ప్రారంభమైందో కూడా చెప్పుకొచ్చారు.