తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ బాలీవుడ్​ నటుడు కన్నుమూత - సునీల్​ శెండే వార్తలు

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్​ నటుడు సునీల్ శెండే తుదిశ్వాస విడిచారు. శెండే మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Actor Sunil Shende passed Away
Actor Sunil Shende passed Away

By

Published : Nov 14, 2022, 6:58 PM IST

Actor Sunil Shende passed Away: సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్​ శెండే కన్నుముశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే శెండే మరణానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. శెండే మరణవార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్​ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

"సునీల్​ శెండే(70).. అదివారం అర్ధరాత్రి విలేపార్లేలోని తన నివాసంలో మరణించారు. హిందూ శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు" అని సినీ విమర్శకులు పవన్​ ఝా మీడియాకు తెలిపారు.

30 సంవత్సరాల సినీ కెరీర్​లో సునీల్​ శెండే.. అనేక చిత్రాల్లో సహాయ నటుడి పాత్రల్లో మెరిశారు. గాంధీ, ఖల్​ నాయక్​, ఘాయల్​, జిద్ది, దౌద్​, మగన్​, విరుద్ధ్​ వంటి చిత్రాల్లో నటించారు. ఆమిర్​ ఖాన్ నటించిన సర్ఫరోష్​ మూవీలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ పాత్రను ఆయన పోషించారు.

ABOUT THE AUTHOR

...view details