Salman Khan Official Notice : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ విషయంలో తన పేరుతో వచ్చే మెయిల్స్‌ను నమ్మొద్దని ఆయన కోరారు. తన పేరును వినియోగించి ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని సల్మాన్ ఖాన్ హెచ్చరించారు. ఇంతకీ ఆయన ఆ పోస్ట్ ఎందుకు పెట్టారో తెలుసా?
సల్మాన్‌ఖాన్‌కు సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరుతో ఇటీవల కాలంలో ఓ ఫేక్ మెయిల్ చక్కర్లు కొట్టింది. సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ తెరకెక్కించనున్న ఓ సినిమాలో నటీనటులను ఎంపిక చేస్తున్నామని.. ఆసక్తి ఉంటే సంప్రదించమని ఆ మెయిల్‌లోని సారాంశం. ఈ విషయం కాస్త సల్మాన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తాజాగా ఓ నోట్ రిలీజ్ చేశారు.
సల్మాన్‌ఖాన్ లేదా ఆయనకు చెందిన సల్మాన్‌ఖాన్‌ఫిల్మ్స్ ప్రస్తుతానికి కొత్త నటీనటులను ఎవరిని తీసుకోవడం లేదు. మేము నిర్మించనున్న భవిష్యత్ చిత్రాల కోసం క్యాస్టింగ్ ఏజెంట్స్‌ను నియమించలేదు. మా సంస్థ రూపొందించనున్న సినిమాల కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నామంటూ మీకు ఏమైనా సందేశాలు వస్తే వాటిని నమ్మకండి. సల్మాన్ పేరుని తప్పుగా వాడుతున్నట్లు ఎవరినైనా గుర్తిస్తే తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని సల్మాన్ ఖాన్ టీమ్ పేర్కొంది. ఇక, సల్మాన్ సినిమాల విషయానికి వస్తే 'కిసీ కా బాయ్ కిసీ కీ జాన్' తర్వాత ఆయన 'టైగర్ 3'లో నటిస్తున్నారు.
పెళ్లిపై సల్మాన్ స్పందన..
Salman Khan marriage : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున చెప్పే పేరు సల్మాన్ ఖాన్. ఈ బాలీవుడ్ స్టార్ హీరో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆయన పెళ్లి పీటలెక్కలేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన ఆయన.. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ఏదో ఒక సమాధానం చెబుతూ వార్తల్లో నిలూస్తునే ఉంటారు. ఇటీవల ఆయన మరోసారిపెళ్లిపై స్పందించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.