నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీలో హిందీ యాక్టర్ రోహిత్ పాఠక్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. బాలకృష్ణతో కలిసి పనిచేసిన అనుభవాన్ని తెలిపారు. అలాగే వీరసింహారెడ్డిలో తన పాత్ర గురించి వివరించారు.
"వీరసింహారెడ్డి సినిమాలో నేను నార్త్‌కు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్‌గా కనిపిస్తాను. నా పాత్ర సినిమాకే కీలకం అవుతుంది. దీనితో సినిమాలోని కథ మొత్తం మలుపు తిరుగుతుంది. తీవ్రమైన ప్రతికారం తీర్చుకునే పాత్ర అది. బాలకృష్ణకు, నాకు మధ్య జరిగే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇంతకు మించి నా పాత్ర గురించి ఎక్కువ వివరాలు చెప్పలేను" అన్నారు.