సౌత్ ఇండస్ట్రీ సినిమాల వైపు బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మన సినిమాలు పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు తారలు కూడా ఇక్కడి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఓ హిందీ సినీయర్ హీరో కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతనే బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి.
'నేనెక్కడున్నా' అనే చిత్రంతో అతడు తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంతో మాధవన్ కోదాడ డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. ఇందులో ఎయిర్టెల్ ఫేమ్ సశా ఛెత్రి హీరోయిన్గా మిమో చక్రవర్తి సరసన నటించింది. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు.. ఈ చిత్ర టైటిల్ టీజర్ పోస్టర్‌ను లాంఛనంగా విడుదల చేశారు.
అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ.. "టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. స్టోరీ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నాను. దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్ విషెస్" అని చెప్పారు.