Bobby Deol Tollywood Debut: బాలీవుడ్ హీరో బాబీ డియోల్.. హిందీలో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు. ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ నటుడు.. ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయాలని చూస్తున్నారు.
బాలయ్య, పవర్‌స్టార్‌తో ఆ బాలీవుడ్ హీరో ఫైట్.. ఎవరంటే? - బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా
Bobby Deol Tollywood Debut: బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ త్వరలో తెలుగులో అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రానున్న 'హరి హర వీర మల్లు', అనిల్ రావిపూడి-బాలకృష్ణ చిత్రంలో ఆయనే ప్రతినాయకుడిగా ఎంపికైనట్లు సమాచారం.
'ఎఫ్3'తో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న డైెరెక్టర్ అనిల్ రావిపూడి.. బాలయ్యతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాబీ డియోల్‌ను ప్రతినాయకుడిగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఆయనను చిత్రబృందం సంప్రదించిందట. ఇందుకు బాబీ కూడా అంగీకరించారని సమాచారం. అనిల్ రావిపూడి-బాలయ్య కాంబోలో రాబోతున్న చిత్రంతో టాలీవుడ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బాబీ డియోల్ ఆశపడుతున్నారు.
మరోవైపు, క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'హరి హర వీర మల్లు' చిత్రంలో కూడా బాబీ డియోల్‌ను విలన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రంలో ఈ రోల్ కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను తీసుకున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్స్ పదే పదే వాయిదా పడుతుండటంతో తన సమయాన్ని వృథా చేసుకోవడం ఇష్టం లేక ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో బాబీ డియోల్‌ను ఎంపిక చేశారట.